అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన రియల్ లైఫ్ షెకావత్ పై ఆసక్తికర చర్చ!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సంపాదించుకున్న క్రేజ్ అంతా కాదు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందే విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుని రిలీజ్ తర్వాత కూడా రచ్చ కొనసాగించింది. ఇక పుష్ప 2 సినిమాల్లో కూడా పుష్పరాజును అరెస్టు చేయడానికి ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో విఫలమవుతాడు.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారిపై చర్చ
ఒక ఎస్పీ పుష్ప రాజ్ ను అరెస్టు చేయలేకపోవడం రీల్ స్టోరీ కానీ రియల్ స్టోరీ లో మాత్రం పుష్ప ను ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్టు చేశాడు. ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి ఎవరు? ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సంబంధించి కథా కమామీషు ఏమిటి? ఆ వివరాలు ఏమిటి అంటే..

అల్లు అర్జున్ ఇంటికెళ్ళి ఆయనను అరెస్ట్
చిక్కడపల్లి సిఐ బానోతు రాజు నాయక్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయనపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం కోసం ఆయన ఇంటికి వెళ్లిన సీఐ జూబ్లీహిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి అల్లు అర్జున్ ఫ్యాన్
ఇక ఈ టోటల్ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటంటే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రాజు నాయక్ అల్లు అర్జున్ అభిమాని . ఒక్కసారైనా అల్లు అర్జున్ తో ఫోటో దిగాలనుకున్న ఇన్స్పెక్టర్ తన అభిమాని హీరోను తానే అరెస్టు చేసే ఒక రోజు వస్తుందని ఊహించలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా అల్లు అర్జున్ ను ఆయన అరెస్టు చేయవలసి వచ్చింది.
రీల్ లైఫ్ లో ఎస్పీ షెకావత్ కంటే రియల్ లైఫ్ లో సిఐ కే గట్స్
తాను అభిమానించే అభిమాని హీరోతో మాట్లాడాలని ఒక ఫోటో తీసుకోవాలని కోరుకున్న ఇన్స్పెక్టర్ ఊహించని విధంగా ఆయనను అరెస్ట్ చేసి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. మొత్తంగా రీల్ లైఫ్ లో ఎస్పీ షకావత్ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంలో విఫలమైన రియల్ లైఫ్ లో మాత్రం పోలీస్ అధికారి రాజు నాయక్ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో ఆయనపై చర్చ జరుగుతుంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications