సబర్వాల్ 'యూటర్న్': లీవుల రద్దు!, ప్రభుత్వ ప్రమేయమా?..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు కీలక విచారణ దశలో ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ లీవ్ పై వెళ్లడం పలు అనుమానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. కేసులో ప్రముఖ సినీ తారల పేర్లు బయటకు రావడంతో.. సబర్వాల్‌పై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలున్నాయి.

డ్రగ్స్ కేసు: 12 మంది సినీ ప్రముఖులు, అరెస్టు అంశంపై ఇప్పుడే చెప్పలేం: అకున్ సబర్వాల్

ఈ నేపథ్యంలోనే మధ్యేమార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం.. ఆయన్ను సెలవులపై పంపించి కేసులో మరిన్ని సంచలనాలు నమోదు కాకుండా జాగ్రత్తపడిందన్న అపవాదు ఉంది. అయితే ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. పరిస్థితి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది.

వాయిదా వేసుకున్నారు:

వాయిదా వేసుకున్నారు:

తన 10రోజుల వ్యక్తిగత లీవ్‌లను తాజాగా సబర్వాల్ రద్దు చేయించుకున్నారు. విచారణ పూర్తయ్యేంతవరకు సెలవులను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసు చుట్టూ ఉన్న తీవ్రత రీత్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అకున్ సబర్వాల్ లీవ్ పై వెళ్తే.. కేసు నీరుగారిపోయే ప్రమాదముందన్న విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయంపై పునరాలోచించినట్లు చెబుతున్నారు. కాగా, నేటి నుంచి 25వరకు లీవ్ కోసం సబర్వాల్ తొలుత అప్లై చేసుకున్నారు.

కీలక దశలో:

కీలక దశలో:

సినీ ప్రముఖులకు నోటీసులు జారీ అయిన తరుణంలో సబర్వాల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి కూడా అపవాదు తెచ్చేదిగా మారడంతో ఆయన తన నిర్ణయం మార్చుకున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో వెలుగుచూసిన వాణిజ్య పన్నుల కుంభకోణం, ఎంసెట్ స్కామ్, ఓటుకు నోటు కేసు, నయీం కుంభకోణ.. ఇలా చాలావరకు కుంభకోణాలు తెరమరుగు కావడంతో ఇక డ్రగ్స్ మాఫియా కేసుకు కూడా ఇదే గతి పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రభుత్వం తెలివిగా వ్యవహరించి ఆ విమర్శకు తావు లేకుండా సబర్వాల్ తో లీవ్ రద్దు చేయించినట్లు చెబుతున్నారు.

KCR Government Cheats sheep farmers
సబర్వాల్ చెప్పిన కారణమేంటి?

సబర్వాల్ చెప్పిన కారణమేంటి?

నిజానికి లీవ్ గురించి అకున్ సబర్వాల్ చెప్పిన సమాధానం కూడా కాస్త తడబాటుగానే ఉంది. తొలుత తల్లి అస్థికల నిమజ్జనానికి వెళ్తున్నానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత లడఖ్ పర్వతారోహణ అని మాట మార్చేశారు. ఒకవేళ తల్లి అస్థికల నిమజ్జన కార్యక్రమం అయితే తన భార్య అయిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా ఆయనతో వెళ్లాలి కదా అనే చాలామంది అభిప్రాయం. దీంతో ఆయన చెప్పిన కారణాలు కృత్రిమమైనవే అన్న విమర్శలు వచ్చాయి.

ప్రభుత్వ ప్రమేయమా?

ప్రభుత్వ ప్రమేయమా?

మొత్తం మీద ప్రభుత్వ ప్రమేయమా? లేక అకున్ సబర్వాల్ సొంత నిర్ణయమా? అన్నది తెలియదు గానీ లీవు రద్దుపై ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక పరిణామాలు ఏమైనప్పటికీ.. కేసు విచారణ ఎలా జరుగబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకిత్తిస్తోన్న అంశం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IPS Akun Sabharwal who is investigating tollywood drugs case was cancelled his individual leave. On Saturday morning he informed to govt on this
Please Wait while comments are loading...