TSRTC: ఆర్టీసీ బస్సుల్లో స్నాక్స్ బాక్స్.. కేవలం రూ.30 ..!
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులకు జర్నీలో స్నాక్స్ బాక్స్ ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో నీళ్ల సీసా ఇస్తోంది. తాజాగా స్నాక్స్ బాక్స్ కూడా ఇస్తే బాగుటుందని ఆలోచన చేస్తోంది. స్నాక్స్ బాక్స్ అందివ్వడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్- విజయవాడ మార్గాల్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సుల్లో అమలు చేయాలని భావిస్తున్నారు.
ఆర్టీసీ అందించే స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లు, మౌత్ ఫ్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు ఆర్టీసీ అనేక ప్రయోగాలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనరల్ రూట్ పాస్ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ ను అందుబాటులోకి తేనుంది. ఎమినిది కిలోమీటర్ల పరిధిలో రాకపోకాలు సాగించే వారు ఈ పాస్ తీసుకోవచ్చు. మే 27 జనరల్ రూట్ పాస్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పాస్ కూడా మామూలు పాస్ ల్లాగా నెల రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆర్డీనరి రూట్ బస్ పాస్ కు రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 లుగా ధర నిర్ణయించారు. పాస్ మొదటిసారి తీసుకుంటే ఐడీ కార్డుకో కోసం రూ.50 అదనంగా వసూల్ చేస్తారు.
జనరల్ రూట్ బస్సు పాస్ లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 162 రూట్లలో అందుబాటులోకి తేనున్నారు. ఈ పాస్ ఉపయోగించి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సిటీ బస్సుల్లో ఆర్టీసీ ఇప్పటికే అనేక రకాల టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో టి-24 టికెట్ ఒక్కటి. ఈ టికెట్ సాధారణ ప్రజలకు రూ.90 అందుబాటులో ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.80 లకే ఇస్తున్నారు. ఈ టికెట్ తో సిటి బస్సుల్లో 24 గంటల పాటు తిరగొచ్చు. అలాగే ఎఫ్-24 టికెట్ కూడా తీసుకొచ్చారు. ఈ టికెట్ కు రూ.300 చెల్లించి ఫ్యామిలీలోని నలుగురు సభ్యులు 24 గంటల పాటు ఆర్టీసీలో తిరగొచ్చు. టీ-6 టికెట్ రూ.50 లకు కొనుగోలు చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు ఎటైనా తిరగొచ్చు.












Click it and Unblock the Notifications