జబర్దస్త్ కమేడియన్‌కు గుండెపోటు: ఆసుపత్రిలో..
హైదరాబాద్: జబర్దస్త్ ఫేమ్, కమేడియన్ చలాకి చంటి గుండెపోటు సంభవించింది.. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటోన్నారు. ఈ ఉదయం గుండెనొప్పి రావడంతో ఇంట్లోనే ఆయన కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తోన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఓ ప్రైవేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతోన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చలాకి చంటి- రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడయ్యారు. దీని ద్వారా కొన్ని సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చిందాయనకు. వెండితెరపై బ్రేక్ త్రూ లభించలేదు. ఫలితంగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఇదివరకు బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు.

చలాకి చంటి అనేది స్క్రీన్ నేమ్. ఆయన అసలు పేరు వినయ్ మోహన్ శర్మ. 2016లో శ్వేతను వివాహం చేసుకున్నారు. 2018లో ఆ దంపతులకు పాప జన్మించింది. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన చంటి తన కేరీర్ మొదట్లో రేడియో మిర్చిలో ఆర్జేగా పనిచేశారు. అనంతరం సినీ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టారు. 2009లో విడుదలైన జల్లు.. ఆయన మొదటి సినిమా. ఆ తరువాత ఆటగదరా శివ, లవ్ స్టేట్స్, రాహు.. వంటి సినిమాల్లో నటించినప్పటికీ బ్రేక్ రాలేదు.

బుల్లితెరపై మాత్రం సత్తా చాటారు. జబర్దస్త్‌తో రెండు తెలుగురాష్ట్రాలకు చిరపరిచితుడయ్యారు. 2013 నుంచీ సుదీర్ఘకాలం పాటు ఈ కామెడీ షోతో అసోసియేట్ అయి ఉంటోన్నాడు. ఈ ప్రోగ్రామ్ ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చలాకీ చంటిగా ప్రతి ఇంటికీ పరిచయం అయ్యాడు. గత ఏడాది బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6లోనూ పార్టిసిపేట్ చేశాడు గానీ చివరి వరకూ హౌస్‌లో కొనసాగలేకపోయాడు.












Click it and Unblock the Notifications