సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ.. తగ్గేదేలేదంటూ పోస్టర్ విడుదల!

జగ్గారెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ లో ఈయన ఒక ఫైర్ బ్రాండ్. జగ్గారెడ్డి ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఎప్పుడూ తన నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవలందించే జగ్గారెడ్డి అప్పుడప్పుడు పార్టీలో కీలక నేతలపైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఇక ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూనే సొంత పార్టీ నేతలపై కూడా విరుచుకుపడతారు.

సినిమాలలో జగ్గారెడ్డి ఎంట్రీ
గత ఎన్నికలలో ఆయన ఓటమి పాలైన తర్వాత రాజకీయంగా కాస్త సైలెంటైన జగ్గారెడ్డి ప్రస్తుతం సినిమాలు మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక త్వరలో జగ్గారెడ్డి లీడ్ రోల్ తో టాలీవుడ్ లో ఒక సినిమా రాబోతుందని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. తాను సినిమాల్లోకి రాబోతున్నానని చెప్పిన జగ్గారెడ్డి ఒక ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నానని వెల్లడించారు. ఈ ఉగాదికి కథ విని ఆ తర్వాత షూటింగ్లో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు.

Jaggareddy entry into movies Poster released of jaggareddy pan india movie

సినిమా పోస్టర్ విడుదల చేసిన జగ్గారెడ్డి
ఇక రాజకీయాల నుంచి కాస్త విశ్రాంతి తీసుకుని ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో ఒక ప్రేమకథా చిత్రంలో లీడ్ రోల్ లో ఆయన నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా జగ్గారెడ్డి విడుదల చేశారు. ఇది తెలుగు మరియు హిందీ భాషలలో వస్తుందని, ఈ ఉగాదికి కథ విని వచ్చే ఉగాది నాటికి సినిమా విడుదల చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

పాన్ ఇండియా సినిమాలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఇక జగ్గారెడ్డి నిజజీవితం ఆధారంగా ప్రస్తుతం సినిమా వస్తుందని ఆయనే నటుడిగా ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్ గా జగ్గారెడ్డి క్యారెక్టర్ ఆ సినిమాలో ఉండబోతుందని ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని దేశవ్యాప్తంగా రిలీజ్ కూడా చేస్తామని చెబుతున్నారు.

అధిష్టానం అనుమతితోనే సినిమాలో నటిస్తానని పేర్కొన్న జగ్గారెడ్డి
అయితే పార్టీ అధిష్టానం టిపిసిసి సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే తాను సినిమాలో నటిస్తున్నానని సినిమాలో ఇంటర్వెల్ దగ్గర మొదలయ్యే తన పాత్ర సినిమా ఎండింగ్ వరకు ఉంటుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మరి జగ్గారెడ్డి రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే సినిమాలో కూడా క్రియేట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+