బంపర్ ఆఫర్: రూ.10కే, రోజుకు 1 జీబీ డేటా ఆఫర్ ను ప్రకటించిన జియో

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:రిలయన్స్ జియో ఆరుమాసాల పాటుఇచ్చిన ఉచిత ఆఫర్ ఈ ఏడాది మార్చి 31వ, తేదితో ముగియనుంది.ఆరు మాసాలపాటు ఉచిత వాయిస్ కాల్స్ ను, డేటాను రిలయన్స్ జియో తన కస్టమర్లకు అందించింది.అయితే రోజుకు ఒక్క జీబీని పదిరూపాయాలకే ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ మార్చి 31వ, తేదితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో జియో ప్రైమ్ కు అప్ గ్రేడ్ అవ్వాలని తన కస్టమర్లకు రిలయన్స్ జియో సూచించింది.

అయితే ఇప్పటికే రిలయన్స్ జియోకు 5 కోట్ల మంది చెల్లింపు చందాదారులుగా చేరారు.సుమారు 10 కోట్లకు పైగా రిలయన్స్ జియో ఉచిత సేవలను వినియోగించుకొంటే అందులో సుమారు 50 శాతం మంది రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్లు గా చేరారు.

jio offer Rs 10 per 1 gb data perday

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను తీసుకొంటే మరో ఏడాది పాటు ఈ సేవలను పొందే అవకాశం ఉంది.అయితే డేటా ప్యాక్ ను మాత్రం రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్ కాల్స్ మాత్రం ఉచితం. ప్రైమ్ యూజర్లకు , నాన్ ప్రైమ్ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకొన్న యూజర్లు తమకు అందుబాటులో ఉన్న డేటా ప్యాక్ ను రీచార్జీ చేసుకోంటేనే టేటా పొందే అవకాశం ఉంది.

అయితే ప్రతి రోజూ 1 జీబీ డేటాను కేవలం పది రూపాయాలకే అలందించనున్నట్టుగా జియో ప్రకటించింది. కానీ కస్టమర్లు తమకు అనువైన ప్యాకేజీని తీసుకోవడానికి my.jio యాప్ లేదా కంపెనీ వెబ్ సైట్ ను చూడవచ్చని రిలయన్స్ జియో చెప్పింది.

రిలయన్స్ జియో మనీ వ్యాలెట్, my.jio యాప్, www.jio.com అనే వెబ్ సైట్ ద్వారా రీ చార్జీ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. మార్కెట్లో అన్ని రీచార్జీ స్టోర్ లలో కూడ జియో ప్రైమ్ వివరాలు లభిస్తాయని ఆ కంపెనీ ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
reliance jio free offer end on march 31 2017.six months reliance jio offered free voice calls and data.and also jio offer Rs 10 per 1 gb data perday.
Please Wait while comments are loading...