త్వరపడండి..ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నాన్ టీచింగ్ ఉద్యోగాల జాతర!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలాకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొంది.
52 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో 52 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కాగా అక్టోబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ స్థాయిలలో నియామకాలు జరగనున్నాయి.

ఖాళీలు ఇవే
అసిస్టెంట్ లైబ్రేరియన్ 4 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1 పోస్టు, సిస్టం ప్రోగ్రామర్ 2పోస్టులు, అలాగే సీనియర్ అసిస్టెంట్ 3 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్ 4 పోస్టులు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక టెక్నికల్ సహాయం కోసం లేబరేటరీ అసిస్టెంట్ 10 పోస్టులు, లాబరేటరీ అటెండెంట్ 5 పోస్టులు, లైబ్రరీ అటెండెంట్ 3 పోస్టులు ఇందులో ఉన్నాయి.
బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కూడా
ప్రస్తుత ఖాళీలతో పాటు గతంలో భర్తీకాని బ్యాక్లాగ్ పోస్టులు సీనియర్ అసిస్టెంట్ 2, ఆఫీస్ అసిస్టెంట్ 3, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2 పోస్టులు ఈ నోటిఫికేషన్లో చేర్చబడ్డాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన విద్యార్హతలు పోస్ట్ ను బట్టి మారుతాయి.
అర్హతలు, ఎంపిక విధానం ఇలా
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డిగ్రీ బీటెక్ బిఈ, ఎంటెక్ ఎం ఈ, ఎంఫిల్, పిహెచ్డి మరియు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ వంటి విభిన్న అర్హతలు కలిగి ఉండాలి. ఇందులో కొన్ని పోస్టులకు యూజీసీ నెట్, పీజీ సెట్ అర్హతలు తప్పనిసరి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలు
అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది నియామక జాబితాను ప్రకటిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి 500 రూపాయలు చెల్లించాలి. ఇతరులు వెయ్యి రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ uohyd.ac.in ను సందర్శించాలి.












Click it and Unblock the Notifications