జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ విచారణ.. ఏం జరిగిందంటే!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న 21 సంవత్సరాల యువతిని లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలతో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి తనను జానీ మాస్టర్ 16 ఏళ్ల వయసు నుంచే లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ పైన pocso చట్టం కింద కేసు నమోదు అయింది.
జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్
ఇక జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరచగా కోర్టు జానీ మాస్టర్ కు రిమాండ్ విధించింది. ఇక తాజాగా జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్
జానీ మాస్టర్ కు లైంగిక వేధింపుల ఆరోపణల కేసు ఉన్న నేపథ్యంలో కేంద్రం జానీ మాస్టర్ కి ఇవ్వాల్సిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ క్రమంలో జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించాలని పోలీసులు నిర్ణయించగా అంతకుముందే జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకుని రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
రేపటికి జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ వాయిదా
ఇక జానీ మాస్టర్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన రంగారెడ్డి కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే కోర్టు ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తననే వేధించినట్టు తనను పెళ్లి చేసుకోవాలని అనేకమార్లు ఇబ్బంది పెట్టినట్టు జానీ మాస్టర్ ను పోలీసులు విచారించిన క్రమంలో వెల్లడించారు.
రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టుకు జానీ మాస్టర్
అంతేకాదు ఆ అమ్మాయి ప్రవర్తన పైన సుకుమార్ తో కూడా మాట్లాడినట్టుగా సుకుమార్ కూడా ఆ అమ్మాయితో పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసినట్టుగా జానీ మాస్టర్ పోలీసులు విచారణలో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా తాజాగా జానీ మాస్టర్ తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో కోర్టు ధర్మాసనం జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications