జూబ్లీహిల్స్ పోరు.. బీజేపీ టికెట్ రేసులో వీరు,గేమ్ ఛేంజర్ ఎవరో!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి కాక రేపుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ రాగా ఈనెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.
జూబ్లీ హిల్స్ ఎన్నికల సమరం
సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలైన ఆయనను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ రెడీ అయింది.

బీజేపీ నుండి జూబ్లీ హిల్స్ టికెట్ కోసం పోటీ
స్థానికుడు, లోకల్ రాజకీయాల మీద పట్టు ఉన్న నాయకుడు అయిన నవీన్ యాదవ్ మీద కాంగ్రెస్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇక ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఈ త్రిసభ్య కమిటీ తమ నివేదికను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అందజేయగా, అభ్యర్థులుగా పోటీలో వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తి రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది.
తనకు అవకాశం ఇవ్వాలన్న మాధవీ లత
అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానని, తాను కూడా అభ్యర్థుల రేసులో ఉన్నానని మాధవి లత తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పాలన వల్ల నష్టం జరిగిందని ఆరోపించిన మాధవీలత, ప్రస్తుతం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తనకు అవకాశం ఇస్తే మార్పు చేసి చూపిస్తానని పేర్కొన్నారు. అధిష్టానం పరిశీలిస్తున్న పేర్లలో తన పేరు కూడా ఉందని ఆమె తెలిపారు.
పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్న మాధవీ లత
తనకు అవకాశం ఇవ్వాలని బిజెపి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె బిజెపి పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నానని ఈ ఉప ఎన్నికలు పార్టీకి చాలా ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం తాను కృషి చేస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications