జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజ రంజన్ హత్యకేసులో కీలక పరిణామం!

తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ రంజన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆరు నెలలుగా నిందితుల కోసం విస్తృతంగా గాలింపు సాగించిన హైదరాబాద్ పోలీసులు తాజాగా ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీని నేపాల్‌లో గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందాలు దేశంలోని పలు నగరాలతో పాటు నేపాల్‌లోనూ నిఘా కొనసాగించగా, ఆమె ఉనికిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మే 2026లో జరిగిన ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన కల్పనను కుటుంబం సంరక్షకురాలిగా పనిలోకి తీసుకున్నారు. అయితే ఆమె ఇంట్లోని నగదు, నగలు దోచుకునే పథకంలో భాగంగా ఇతర నిందితులతో కలిసి హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వినయ్ రంజన్ రే బెంగళూరుకు వెళ్లిన సమయంలో మే 7 అర్ధరాత్రి తర్వాత తనూజపై దాడి జరిగింది. ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

Jubilee Hills murder case Major Breakthrough in Jubilee Hills Murder Case - Police Trace Key Accused Kalpana in Nepal

అనంతరం నగలు, విలువైన వస్తువులు తీసుకుని నిందితులు పరారయ్యారు. పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో సునీల్ బహదూర్ ఔజీ పై పీడీయాక్ట్ ప్రయోగించి జైలుకు తరలించారు. నేరం తర్వాత నేపాలీ ముఠా బీహార్ సరిహద్దుల మీదుగా నేపాల్‌కు చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. కల్పన నేపాల్‌లో ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించారు. రెండు నెలలుగా అక్కడే మకాం వేసి ఆమెను గుర్తించారు. స్థానిక పరిస్థితులు, వాతావరణం కారణంగా అదుపులోకి తీసుకోవడం కొంత సవాలుగా మారినా పోలీసులు విజయం సాధించినట్లు తెలుస్తోంది.

ఈ కేసు మొదట్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం అయింది. నేపాలీ ముఠా చేతుల్లో జరిగిన హత్యగా ప్రాథమికంగా గుర్తించారు. ఇంట్లోని కదలికలు, కుటుంబ సభ్యుల సమయాలు గమనించి అదును చూసి ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. కొందరు సిబ్బంది నిర్లక్ష్యంపై ఛార్జిమెమోలు కూడా జారీ చేశారు. ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకుంటే హత్య వెనుక ఉన్న పూర్తి కుట్ర, ఇతర సభ్యుల పాత్ర, దోచుకున్న నగల గమనం లాంటి వివరాలు మరింత స్పష్టం కావచ్చు.

రైతులకు తీపికబురు.. రూ.224 కోట్లతో రాయితీ విత్తనాలు.. ఉద్యాన పంటలకు రూ.296 కోట్లు!
రైతులకు తీపికబురు.. రూ.224 కోట్లతో రాయితీ విత్తనాలు.. ఉద్యాన పంటలకు రూ.296 కోట్లు!

పోలీసులు అధికారిక ప్రకటన వెలువరించకపోయినా, ఈ పురోగతి కేసు పరిష్కారం దిశగా ముఖ్యమైన అడుగుగా చూడవచ్చు. జూబ్లీహిల్స్ లాంటి ఉన్నత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకుని న్యాయం జరిగేలా చూడాలని కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+