పెద్ద శని, చిన్న శని: బాబు, రేవంత్‌పై జూపల్లి, గుండాగిరీ చేస్తున్నారన్న ఎర్రబెల్లి
హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలంగాణ పాలిట తెలుగుదేశ పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు పెద్ద శని, టిడిపి ఎమ్మలె్యే రేవంత్‌రెడ్డి చిన్న శని లాంటి వారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌లో మార్కెట్‌యార్డు శంకుస్థాపన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
‘నాకు సభ్యత, సంస్కారం ఉన్నందుకే మార్కెట్‌యార్డు శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ కోసం గంట వరకు వేచి చూశాను. ఆయన రాలేదు. తెలంగాణ పోరాటం కోసం ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రేవంత్ ఏనాడూ స్పందించలేదు. రేవంత్ గురించి ప్రజలకు బాగా తెలుసు' అని జూపల్లి అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం అంటూ చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాస్తే రేవంత్ ఏమో లేఖ రాయలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆరునూరైనా పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టి తీరుతామని తేల్చి చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి వారం రోజుల్లో టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాల్లోనే సమస్యలను పరిష్కరించేందుకు గ్రామజ్యోతి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ వస్తే అంధకారం ఏర్పడుతదని బాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు, వారు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని నిరూపితమైదని అన్నారు.
వచ్చే వానా కాలం నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు, గృహాలకు 24 గంటల కరెంట్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ల కోసమే రూ. 130 కోట్లు కేటాయించామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కొడంగల్ నియోజకవర్గ స్థాయిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
గుండాగిరీ చేస్తున్నారు: జూపల్లిపై ఎర్రబెల్లి
మంత్రి జూపల్లి కృష్ణారావు గుండాగిరీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచరులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ధర్నాకు దిగిన రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
పాలకుర్తిలో శుక్రవారం మంత్రి పర్యటన ఉందని చెప్పిన ఆయన, స్థానిక ఎమ్మెల్యేనైనా తనకు ఇంత వరకు సమాచారం లేదని మండిపడ్డారు. కర్ణాటక సరిహద్దు వద్ద డ్రామాలు ఆపి, ఢిల్లీ వెళ్లి అక్రమ ప్రాజెక్టులను ఆపించాలని ఎర్రబెల్లి మంత్రి జూపల్లికి హితవు పలికారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications