హైదరాబాద్ ఆటోవాలాపై అమెరికా మహిళ ప్రతీకారం
హైదరాబాద్: ఆటోవాలాపై ఓ అమెరికా మహిళ సరికొత్త పద్ధతిలో ప్రతీకారం తీర్చుకుంది. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. హైదరాబాదుకు చిరపరిచితురాలైన ఆమె ముప్పు తిప్పలు పెట్టిన ఓ ఆటోవాలా సాగించిన బేరసారాల వీడియోను సోషల్ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
జార్జిటౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ సి. క్రిస్టీన్ ఫెయిర్ దక్షిణ ఆసియా భాషలు, సాంస్కృతిక మార్పులు అనే అంశపై పరిశోధనలు చేస్తోంది. తన పరిశోధనలో భాగంగా ఆమె 1997 నుంచి పలుమార్లు హైదరాబాదుకు వచ్చి వెళ్లింది.
ఉర్దూహిందీ కలగలిసిన హైదరాబాదీ భాషపై ఆమె పట్టు సాధించింది కూడా. మూడు రోజుల క్రితం ఆమె బస చేసిన హోటల్ నుంచి బయటికి వచ్చి ఆటో కోసం కేకలు వేసింది. చార్మినార్‌కు వెళ్లాలని ఆటోవాలాకు చెప్పింది. విదేశీయురాలు కాబట్టి పర్స్ నిండా మనీ ఉంటుందని, చార్మినార్ ఎంత దూరమో కూడా తెలిసి ఉండదని భావించిన ఆటోవాలా డబ్బులు దండుకోవాడనికి ఉవ్విళ్లూరాడు.

మీటర్ మీద చార్మినార్‌కా రావాలని ఆమె ఆటోవాలను అడిగింది. అలా కుదరదని, తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని అతను చెప్పాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత ఆటోలో కూర్చుని మొబైల్ కెమెరా ఆన్ చేసి ఆటోవాలా తీరును వీడియో తీసింది.
కావాలంటే రోజంతా ఖాళీగా ఉంటాను గానీ మీటర్‌పై మాత్రం రానని ఆటోవాలా తెగేసి చెప్పాడు. ఆ మాటను ఆమె రిపీట్ చేసింది. మధ్యమధ్యలో బాలీవుడ్ సాంగ్స్‌ను హమ్ చేసింది. అయితే, చివరికి ఆటోవాలా దిగి వచ్చి మీటర్ రేటుకు ఆమెను చార్మినార్ వద్ద దిగబెట్టడానికి అంగీకరించాడు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications