కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే!

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న ఈ సమయంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లలో OBC మహిళలకు సబ్-కోటా కల్పించడం అంతే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

కేంద్రానికి కవిత అల్టిమేటం

మహిళా బిల్లులో OBC మహిళలకు ఉప-కోటా కల్పించకపోతే అది మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అవుతుందని కవిత పేర్కొన్నారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం కోసం OBC మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని, రిజర్వేషన్లలో మరో రిజర్వేషన్ ఉంటేనే న్యాయం సాధ్యమని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. OBC మహిళలకు సబ్-కోటా లేకుండా ముందుకు వెళ్తే మరోసారి పోరాటం తప్పదని కవిత హెచ్చరించారు.

Kalvakuntla Kavitha gave ultimatum to central govt on sub-quota for OBC women warned protests

మహిళా రిజర్వేషన్ బిల్ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలను ఏకం చేసి ఢిల్లీలో దీక్ష చేసినట్టుగానే ఇప్పటికీ చేస్తామని, ఈ విషయంలో విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఈ డిమాండ్ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే చేశామని గుర్తు చేస్తూ, OBC సబ్-కోటా లేకపోతే ఆ వర్గాల ఆడపిల్లలకు చట్టసభల్లో అవకాశం దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు.

నిజమైన సామాజిక న్యాయం ఇదే అన్న కవిత

దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయటమే నిజమైన సామాజిక న్యాయమని కవిత ప్రకటించారు. అత్యధిక సంఖ్యలో ఉన్న OBCవర్గాల మహిళలకు రిజర్వేషన్లు లేకపోతే న్యాయం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. SC, ST మహిళలకు రాజ్యాంగబద్ధ వాటా ఉంటుండగా OBCల పరిస్థితి ఏమిటని నిలదీశారు. అన్నిపార్టీల నాయకులు, OBC మహిళా నేతలు, సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. OBC మహిళలకు సబ్-కోటా కేటాయించే వరకు జాగృతి తరపున పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.

కేంద్రం OBC కోటాపై స్పందించాలని డిమాండ్

దేశ రాజకీయాల్లో మహిళలకు స్థానం కల్పించాలనే లక్ష్యంతో తాను, తమ నాయకులు చేసిన పోరాటం ఫలితంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు పడిందని కవిత తెలిపారు. 18 రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలను ఏకం చేసి జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష, రౌండ్ టేబుల్ చర్చలు, నిరసనల ద్వారా ఈ అంశాన్ని జాతీయ అజెండాగా మార్చామని గుర్తు చేశారు. అయితే మహిళల కోటాలో OBC సబ్-కోటా ప్రస్తావన లేకపోవడం విచారకరమని, కేంద్రం OBC కోటాపై స్పందించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+