కవిత, కేసీఆర్ ఫ్యామిలీపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందని స్పస్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు.

తెలంగాణ చాలదన్నట్లు.. ఢిల్లీ మీద పడ్డరంటూ ఈటల

తెలంగాణ చాలదన్నట్లు.. ఢిల్లీ మీద పడ్డరంటూ ఈటల

అంతేగాక, తెలంగాణ చాలదన్నట్లు.. దోచుకోవడానికి ఢిల్లీ మీద కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుటుంబం పడిందని ఆరోపించారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ కాదని.. కేసీఆర్ ప్రబుత్వమని విమర్శించారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ ను మట్టికరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో అంటూ ఈటల

తెలంగాణ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో అంటూ ఈటల

దర్యాప్తు సందర్భంగా సిట్ నివేదికలోని అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి తెరతీసిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు ఈటల రాజేందర్. 'ఏ పార్టీకి కూడా సొంత హెలికాప్టర్లు, విమానాలు లేవు. విమానాలు కొంటున్నమని చెప్పిన వ్యక్తి ఎవరు? హెలికాప్టర్లు పెట్టుకొని తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాత జాగీర్ లాగా ఇక్కడ నుంచి వేలకోట్ల రూపాయలు పంపించి తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుంది ఎవరు? అని ఈటల రాజేందర్ నిలదీశారు.

కేసీఆర్ పార్టీకి 870 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న ఈటల

కేసీఆర్ పార్టీకి 870 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న ఈటల

'తనపార్టీ అకౌంట్లో అతి తక్కువ కాలంలోనే 870 కోట్ల రూపాయల వైట్ మనీ ఉందని చెప్పింది కేసీఆర్ కాదా? ఉపాసం ఉన్న పార్టీ..అటుకుల బుక్కిన పార్టీకి 8 సంవత్సరాల కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేయాలి.. ఎవరికైనా డబ్బులు ఊరికినే ఇస్తారా? అంటూ ఈటల రాజేందర్ నిలదీశారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి రాజేందర్ తోపాటు ముదిరాజ్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయనే ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ ప్రయోగిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించిన నేపథ్యంలో ఈటల రాజేందర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+