బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు.. కామారెడ్డిలో టెన్షన్!!
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై కేసు నమోదైంది. బండి సంజయ్ తో పాటు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సహా మరో ఐదుగురు బీజేపీ ముఖ్య నేతలపై కామారెడ్డి జిల్లా దేవన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కామారెడ్డి రైతులకు మద్దతుగా బీజేపీ
కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ గతకొన్ని రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు బీజేపీ మద్దతు ప్రకటించింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు నష్టం చేసే మాస్టర్ ప్లాన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. అన్నదాతల జేఏసీ నిన్న కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చిన క్రమంలో బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

బండి సంజయ్ కామారెడ్డి వెళ్ళటంతో ఉద్రిక్తత
మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసుకునే వరకు రైతుల పక్షాన పోరాడతాం అన్నారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్‌ను ముట్టడికి కామారెడ్డికి వెళ్ళారు. బండి సంజయ్ ఆ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులను తోసేసి కలెక్టరేట్ గేటు వైపు దూసుకెళ్లారు. దీంతో పరిస్థితులు చేదాటకుండా పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. దీంతో కలెక్టరేట్ వద్ద రాత్రి సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నెలకొంది.

బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు
తీవ్ర ఉద్రిక్తత నుడుమ బండి సంజయ్‌ను పోలీసు వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.ఆయనపై, అలాగే బీజేపీ ముఖ్య నాయకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లా పాతరాజంపేట గ్రామంలో ఇండస్ట్రియల్ జోన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం రైతుల ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాస్తారోకో వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆపై పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications