MLC kavitha కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది.. కేసీఆర్ వ్యాఖ్యలు!
తెలంగాణ ఎమ్మెల్సీ కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుండి బయటకు రానున్నారు. నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ సందర్భంగా బెయిల్ వస్తుందని గంపెడాశలతో కేటీఆర్ ,హరీష్ రావు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఎమ్మెల్సీ కవితకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
కవితకు బెయిల్ .. కేసీఆర్ వ్యాఖ్యలు వైరల్
ప్రస్తుతం కవిత బెయిల్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కెసిఆర్ అభిమానులు డాటర్ ఆఫ్ ఫైటర్ ఈజ్ బ్యాక్ అంటూ కవిత ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని గతంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కడిగిన ముత్యంలా వస్తుంది కవిత అన్న కేసీఆర్
లిక్కర్ స్కాం ఒక బోగస్ అని, ప్రతి రాష్ట్రానికి తమదైన మద్యం విధానం ఉంటుందని, కానీ కావాలని నరేంద్ర మోడీ ఢిల్లీ లిక్కర్ స్కాం సృష్టించారని, ఈ కేసులో తన కుమార్తె కవితను అన్యాయంగా ఇరికించారని వ్యాఖ్యలు చేశారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని మీరు చూస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కడిగిన ముత్యంలా బయటికి రాబోతుంది కవిత అక్క 🔥✊
— KK (@KittiBabu1) August 27, 2024
న్యాయం గెలిచింది 🙏 pic.twitter.com/joJ0d41EhE
కవితకు ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు
ఇక సుప్రీంకోర్టు వద్ద ఇప్పటికే ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు కవితకు బెయిల్ రావడంతో సంతోషంలో మునిగిపోయారు. అందరూ కేటీఆర్ కు, హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు తో పాటు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కవితకు ఘనస్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
కవిత బెయిల్ తో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఇదిలా ఉంటే కవితకు బెయిల్ రావటంపైన కాంగ్రెస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ కవిత బెయిల్ కు కారణమని బీజేపీ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం నేపధ్యంలో బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ రాజకీయాలను రసవత్తరంగా మార్చారు. ఇక కవిత బెయిల్ తో న్యాయం గెలిచింది అని కేటీఆర్ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications