Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. గులాబీ పార్టీ మూలాలపై గురి!

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు కవిత షాక్ ఇవ్వనున్నారా? కొత్త రాజకీయ పార్టీని పెడతానని ఇప్పటికే ప్రకటన చేసిన కవిత పార్టీ పేరుతో కెసిఆర్ కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టనున్నారా? కవిత పార్టీతో ప్రధానంగా టార్గెట్ చేసేది బీఆర్ఎస్ నేనా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

కొత్త పార్టీ పేరుపై షాకింగ్ ప్రకటన చేసిన కవిత

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఈరోజు చిట్ చాట్ లో తన అభిప్రాయాలను వెల్లడించిన కవిత తన పార్టీకి 'టీఆర్ఎస్ - తెలంగాణ రాష్ట్ర సమితి' అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుందని ప్రశ్నించిన కవిత, టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని, ఆ పేరుతో పార్టీని ప్రారంభిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని ఆమె తేల్చి చెప్పారు.

kavitha comments on her political party to establish in the name of TRS Big shock for kcr and ktr

పార్టీ రిజిస్ట్రేషన్ పై కవిత కీలక వ్యాఖ్యలు

పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక బృందం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలే తమకు ఆధారమని, బీహార్ సిద్ధాంతాలు ఉండవని కవిత స్పష్టం చేశారు. ఆవిర్భావం రోజున అమరవీరుల స్తూపాన్ని సందర్శిస్తామని, వేదికపై ఉద్యమకారులు ఉంటారని కవిత తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని తాము మరువబోమనీ స్పష్టం చేశారు. డీఎస్‌పీ విశారదన్ మహరాజ్‌తో కలిసి పనిచేస్తామన్నారు; కాంగ్రెస్ తమకు ప్రధాన శత్రువని ప్రకటించారు.

సిద్ధిపేట నుండి పోటీ చేస్తానన్న కవిత

బీఆర్ఎస్ పార్టీని 'రిచ్ పార్టీ' అంటూ కవిత తీవ్ర విమర్శలు చేశారు. అది 'గుంపు మేస్త్రి, గుంట నక్క దోస్తుల' పార్టీ అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ వస్తే సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని, గజ్వేల్ వచ్చినా పరిశీలిస్తానని ఆమె వెల్లడించారు. నిజామాబాద్‌లోని చాలా సీట్లు ఈసారి మహిళా రిజర్వేషన్ పరిధిలోకి వస్తాయని కూడా కవిత అంచనా వేశారు.

ఆంధ్రలో అమరావతి ఉంటే ఎంత, లేకుంటే ఎంత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నగరాన్ని బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ 'ఫ్యూచర్ సిటీ' పేరుతో నగరాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ఓడించిన రేవంత్, ఇప్పుడు కేరళలోనూ ఓడిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్న కవిత, ఆంధ్రలోని అమరావతి ఉంటే ఎంత, లేకుంటే ఎంత, దాని గురించి పట్టించుకోబోమని స్పష్టం చేశారు.

నాడు కేసీఆర్ లా జాగృతి కోసం కష్టపడతా

కేసీఆర్ కష్టపడితేనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని కవిత గుర్తుచేశారు. జాగృతి కోసం కూడా అదే విధంగా కష్టపడతానని స్పష్టం చేశారు. తన లిక్కర్ కేసు కొట్టివేతపై స్పందిస్తూ, ప్రకృతి తనకు సహకరిస్తోందని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తెలివైనవారిని ఆపవచ్చు కానీ, అదృష్టవంతులను ఆపలేరని ఆమె అభిప్రాయపడ్డారు.

కల్తీ మామిడి పండ్లపై హెచ్-ఫాస్ట్ నిఘా.. సమాచారం ఇవ్వమన్న సీపీ సజ్జనార్
కల్తీ మామిడి పండ్లపై హెచ్-ఫాస్ట్ నిఘా.. సమాచారం ఇవ్వమన్న సీపీ సజ్జనార్

ఆడబిడ్డకు ఓటు వెయ్యటం ఒక భావోద్వేగం

కష్టపడటంలో చంద్రబాబు అద్భుతమని, పార్టీ నిర్మాణం లో టీడీపీ బలంగా ఉందని కవిత ప్రశంసించారు. ఆడబిడ్డకు ఓటెయ్యడం కేవలం ఒక భావోద్వేగమని పేర్కొన్నారు. భగవద్గీతను చాలాసార్లు చదివానని, ఇంకా చదువుతున్నానని, దాని గొప్ప నీతి 'యుద్ధం చేయాల్సిందే'నని ఆమె వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+