బిడ్డా కవితా... కేసీఆర్ కు నీవల్ల ఏందీ గోస!
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన కెసిఆర్ ప్రభావం మసక మారిందా? బీఆర్ఎస్ ప్రతిష్ట కనుమరుగైపోయిందా? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తుందా? పార్టీలో కవిత సృష్టించిన సునామి బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నార్థకం చేయబోతుందా? మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా తయారైందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
బీఆర్ఎస్ లో ముసలం
బీఆర్ఎస్ పార్టీలో అధినేతకు కవిత లేఖ రాయడం, పార్టీ తీరుపైన, పార్టీ అధినాయకత్వం పైన ఆమె అసహనం వ్యక్తం చేయడం, పార్టీ అభిప్రాయాలపైన ఆమె భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడం ఇక కెసిఆర్ దేవుడే కానీ, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం, వంటి అనేక పరిణామాల తరువాత, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రచ్చన్నయుద్ధం జరుగుతోందని వార్తలు బయటకు వచ్చాయి.

కవిత తీరుతో ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ అయిన బీఆర్ఎస్
దీనికి ఊతమిస్తూ ఆ తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కెసిఆర్ తో భేటీ తర్వాత కవిత వ్యాఖ్యలపైన ఎవరూ మాట్లాడవద్దు అంటూ అంతర్గతంగా పార్టీ ముఖ్యనేతలకు సూచన చేయడం, కవితను ఒంటరిని చేసే ప్రయత్నం చేయడం వంటి పరిణామాల తరువాత బీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక కవిత రాజకీయంతో బిజెపికి లాభం జరుగుతుందని కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ కే లబ్ధి జరుగుతుందని బిజెపినేతలు ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పైన రేవంత్ సెటైర్లు
కవిత చేసిన వ్యాఖ్యలతో వచ్చిన అవకాశంతో ఎవరికి వారు కెసిఆర్ పైన రాజకీయంగా అస్త్ర శాస్త్రాలను పదును పెట్టారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీ పేరు మార్చి డిఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్రసమితి అంటూ కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సెటైర్లు వేస్తూ పార్టీ పేరును మార్చి వ్యాఖ్యలు చేశారు.
కవిత చేసిన పనికి చిరాకులో కేసీఆర్
కవిత రాసిన లేఖను ప్రస్తావిస్తూ కవిత వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ అందులో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే కెసిఆర్ రాజకీయాలు చేయాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ ను నిలదీశారు. దీంతో కేసిఆర్ బిడ్డ కవిత చేసిన పనికి తల పట్టుకుంటున్నారు. అసలే ఎన్నికల్లో ఓటమిపాలై, రాజకీయంగా లేవలేని స్థితిలో ఉంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, కవిత చేసిన పనికి మరింత లేవలేని స్థితికి పార్టీ చేరిందని లబోదిబోమంటున్నారు.
బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ కావాలంటే మిరాకిల్ జరగాల్సిందే
మరి ఈ పరిస్థితి నుంచి మళ్లీ పార్టీ పుంజుకోవడానికి కెసిఆర్ ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ కావడానికి గులాబీ బాస్ ఏదైనా మిరాకిల్ చేయాల్సిందేనని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications