కవిత డూప్లికేట్ పార్టీ: సెటైర్లతో చిత్తు చేసిన బీఆర్ఎస్!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)పై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ (BRS) సంధించిన సెటైరికల్ బాణాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సొంత కుటుంబం నుంచే కొత్త కుంపటి మొదలవ్వడం ఒక ఎత్తయితే, పాత పేరును తలపించేలా 'టీఆర్ఎస్' అనే పేరును ఎంచుకోవడంపై గులాబీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి.

కవిత పార్టీ పేరును ప్రకటించిన కొద్దిసేపటికే బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రత్యక్షమైంది. "ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!" అనే క్యాప్షన్‌తో కోల్గేట్, బిస్లరీ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులు.. వాటిని పోలి ఉండే నకిలీ ఫోటోలను షేర్ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను వాడుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ సెటైర్ వేశారు. రాష్ట్రం కోసం పోరాడిన అసలైన తెలంగాణ పార్టీ తమదేనని, ఈ కొత్త పార్టీ కేవలం అనుకరణ మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేసింది.

Kavitha Launches TRS Party BRS Hits Back With Viral Satire Saying Original is Always Original

మునీరాబాద్ వేదికగా 'రాష్ట్ర సేన' ఆవిర్భావం

మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన రాజకీయ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన మహిళా కార్యకర్తల మధ్య 'తెలంగాణ రాష్ట్ర సేన' జెండాను ఆమె ఆవిష్కరించారు. గతంలో బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ పేరును పోలి ఉండేలా తన పార్టీ పేరును 'TRS' అని ప్రకటించడం వెనుక పాత కేడర్‌ను ఆకట్టుకునే వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం నినాదాలతో కవిత ఈ కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు.

కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. గులాబీ పార్టీ మూలాలపై గురి!
కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. గులాబీ పార్టీ మూలాలపై గురి!

గన్‌పార్క్ సాక్షిగా అమరవీరులకు నివాళి

పార్టీ ఆవిర్భావ సభకు ముందే కవిత గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించడం ద్వారా సెంటిమెంట్ రాజకీయానికి తెరతీశారు. అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో నేడు హక్కులు కాలరాయబడుతున్నాయని, వాటి పరిరక్షణ కోసమే తాను ఈ కొత్త బాధ్యతను తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఇప్పటికే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌కు, కవిత తీసుకున్న ఈ నిర్ణయం ఊహించని షాక్ అని చెప్పవచ్చు.

ఆ తప్పు సరిదిద్దుకోవడానికే వచ్చా.. అందుకే ఈ యుద్ధం: కేసీఆర్‌పై కవిత ఫైర్!
ఆ తప్పు సరిదిద్దుకోవడానికే వచ్చా.. అందుకే ఈ యుద్ధం: కేసీఆర్‌పై కవిత ఫైర్!

గులాబీ కోటలో ముదురుతున్న చీలిక?

కవిత కొత్త పార్టీ ప్రకటన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌కు అతిపెద్ద అగ్నిపరీక్షగా మారింది. ఒకవైపు సీనియర్ నేతలు పార్టీని వీడుతుంటే, మరోవైపు కుటుంబ సభ్యులే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాల్లో 'టీఆర్ఎస్' అనే పేరుకు ఉన్న సెంటిమెంట్‌ను కవిత తన వైపు తిప్పుకోవాలని చూస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం దానిని 'ఫేక్ బ్రాండ్'గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ 'అసలు - నకిలీ' పోరు రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+