Kavitha: కేసీఆర్ కు సిట్ నోటీసులపై కవిత షాకింగ్ రియాక్షన్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో brs అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం పైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఇటీవల రాజకీయాలలో నేను సైతం అంటూ దూకుడును చూపిస్తున్న కల్వకుంట్ల కవిత షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
కేసీఆర్ కు నోటీసులపై కవిత
ఒకపక్క బి ఆర్ ఎస్ పార్టీని తూర్పార పడుతూనే మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పైన ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసుల వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కవిత అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను అణిచివేసే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పైన కవిత పలు అనుమానాలను వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్ర అని కవిత అభిప్రాయపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ పైన కవిత అభిప్రాయం ఇదే
ఎన్నికల సమయంలో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని కవిత ఆరోపించారు. సిట్ విచారణ సీరియస్ గా సాగడం లేదని సందేహం కూడా ఉందని కవిత పేర్కొన్నారు. ఈ ఎంక్వయిరీ ని ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలని కవిత ప్రశ్నించారు. ఫోన్ టాపింగ్ అనేది ఏ రకంగా చూసిన బాధాకరమైన విషయమని, దానిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం సరికాదని కవిత వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే కవిత ఆసక్తికర రాజకీయం
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే, కేటీఆర్, హరీష్ రావుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే కవిత బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కు మాత్రం అవసరమైనప్పుడు తన మద్దతును ప్రకటిస్తున్నారు. కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం పైన, సిట్ తీరు పైన, ఎన్నికల సమయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పైన కవిత ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షం పైన ఒత్తిడి తెస్తే, ఎన్నికల పైన ఫోకస్ ఉండదని అధికార పక్షం ప్లాన్ చేసిందన్న అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేశారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
కొత్త పెన్షన్ల మంజూరు వీరికే, అర్హుల జాబితా - పంపిణీ ఆ రోజు నుంచే..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. మాటల్లేవ్! -
భారీగా పెరిగిన యూజర్ ఛార్జీలు, ఇక ఈ సేవలు మరింత భారం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!











Click it and Unblock the Notifications