కేటీఆర్.. పార్టీ ఏమైనా మీ జాగీరా?

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన వ్యవహారం కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత కేటీఆర్ పరోక్షంగా స్పందించిన తీరు పార్టీలో అంతర్గత కలహాలను, ముఖ్యంగా ఆధిపత్య పోరులో భాగంగా అన్నాచెల్లెళ్ల పంచాయితీని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువగా మారాయి.

కవిత కోసం కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సైతం టార్గెట్ చేస్తూ కవితకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు పెడుతున్న పోస్టులు పార్టీలో చర్చకు కారణంగా మారాయి. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని చెప్పిన కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా, బహిర్గతంగా ఎవరు మాట్లాడారో చెప్పాలని ఆ పోస్టుల ద్వారా ప్రశ్నిస్తున్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బయటకు వచ్చేలా చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

kavitha vs ktr social media war started kavitha followers direct questions to ktr

Take a Poll

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత చెప్పినప్పుడు, ఆమె చేసిన వ్యాఖ్యల పైన కేటీఆర్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా కొనసాగే పార్టీ అని, ఈ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్యాయం ఎందుకు పాటించటం లేదో చెప్పాలని నిలదీశారు.

పార్టీ ఏమైనా మీ జాగీరా?
కవిత తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని, తనపై జరుగుతున్న కుట్రలను కెసిఆర్ కు లేఖ రాస్తే ఆ లేఖను బయటకు తెచ్చి కుట్రలు చేసే వారిని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసే వారిని ఎందుకు వదిలి పెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ ఏమైనా మీ జాగీరా? అక్కకు హక్కులు లేవా? అంటూ సోషల్ మీడియా పోస్టుల ద్వారా కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కవిత కోసం రంగంలోకి సన్నిహితులు
తెలంగాణ విత్ కవితక్క, వుయ్ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సోషల్ మీడియా పోస్టులు పెడుతూ కవితకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధిస్తూ కవిత సన్నిహితులు పెడుతున్న పోస్టులు ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. కవిత లేఖ బయటకు వచ్చి రెండు రోజులైనా ఇంత వివాదం జరుగుతున్నా కవితకు కెసిఆర్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది.

కేసీఆర్ నిర్ణయం పైనే సర్వత్రా ఆసక్తి
కెసిఆర్ నిర్ణయం ఏమిటి అన్న ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఏది ఏమైనా కవిత కోసం కవిత అనుచరులు, అత్యంత సన్నిహితులు ప్రస్తుతం రంగంలోకి దిగి సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. దీనిపైన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏం చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం అందరి ముందు ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+