గూగుల్ డూడుల్‌గా ‘బతుకమ్మ’: గూగుల్ ఇండియా ఎండీకి కవిత లేఖ
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం ఈ ఏడాది గూగుల్ డూడుల్ రూపొందించాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత గూగుల్ ఇండియా ఎండీకి ఓ లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే గాక, ప్రపంచ వ్యాప్తంగా 30లక్షల మంది మహిళలు బతుకమ్మ పండగును ప్రతియేటా ఘనంగా నిర్వహించుకుంటారని వివరించారు. ఇలాంటి గొప్ప సాంప్రదాయానికి గూగుల్ డూడుల్‌తో గౌరవించాలని కవిత కోరారు.

బతుకమ్మ పండగ మహిళల స్వేచ్ఛ, ఐక్యతలకు సంకేతమని కవిత వివరించారు. అనేక రకాల పూలతో నిర్వహించుకునే ప్రకృతి పండగ అని ఆమె తెలిపారు. తెలుగు మహిళలు తమ గొప్ప సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఇప్పుడు 15దేశాల్లో బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
My letter to @RajanAnandan MD of @GoogleIndia requesting to feature #Bathukamma as a google doodle this year pic.twitter.com/7QO2cQOsWz
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 27, 2018
అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ పండగను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారని కవిత తెలిపారు. మహిళల పండగను తగిన గుర్తింపునిస్తూ గూగుల్ డూడుల్‌గా చూపించాలంటూ గూగుల్ ఇండియా ఎండీని కవిత కోరారు. మీరు గూగుల్ డూడుల్‌గా బతుకమ్మ పండగను ప్రదర్శిస్తారని ఆశిస్తున్నామని, ధన్యవాదాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications