కేసీఆర్ నీది జాతీయ పార్టీనేనా.. నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!!
నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఫైరయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఖమ్మం, కొత్తగూడెం లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని పేర్కొనడంపై మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు ఆని, జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని ఎలా చెప్తాడని ప్రశ్నించారు. అధికారం రాదేమో అనే భయంతో మతిభ్రమించి మాట్లాడుతున్నాడు ఆని తీవ్ర స్థాయిలో మండిపడుతూ జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.

నల్లగొండలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం గా కనిపిస్తోందని దీంతో సీఎం కెసిఆర్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడనీ అన్నారు. కెసిఆర్ కు రోజులు దగ్గరపడ్డాయి. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుంది అన్న ఆందోళనతోనే ఇలా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
జాతీయ పార్టీ అని చెప్పి మహారాష్ట్రలో అక్కడి డి గ్రేడ్ స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకున్న కెసిఆర్ ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. నిజంగా ప్రాంతీయ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్మితే తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత రాష్ట్ర సమితి గా ఎందుకు మార్చారు అంటూ ప్రశ్నించారు.
టిఆఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా ఎందుకు మార్చారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, హిమాచలప్రదేశ్లో గెలిచిందని , అక్కడి ప్రజలు ప్రాంతీయ పార్టీలు కాకుండా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మణిపూర్ తెలంగాణ రాష్ట్రాలలో కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీ నే ఆని స్పష్టం చేశారు..
ఏప్రిల్, మే నెలలో జరిగే ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు . జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యంగా ఉంటుందనీ అందుకే ప్రజలంతా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications