ధర్నాచౌక్ నుండి నేరుగా రాజ్ భవన్ కు కేసీఆర్.!యాసంగి వేయాలా వద్దా కేంద్రం చెప్పాలన్న సీఎం.!
హైదరాబాద్ : ధర్నాచౌక్ దద్దరిల్లింది. ఇందిరా పార్క్ పరిసరాలు గులాబీమయం అయ్యాయి. ధర్నాల అడ్డ జైతెలంగాణ నినాదాలతో మరోసారి మారుమోగిపోయింది. కేంద్ర ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తేనే తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుందని సీఎం చంద్రశేఖర్ రావు ఉద్ఘాటించారు. అంతే కాకుండా యాసంగిలో వరి పంట పండించాలా వద్దా అనే అంశంలో యస్ ఆర్ నో చేప్పాలని కేంద్రానికి సూటి ప్రశ్న సంధించారు చంద్రశేఖర్ రావు. రైతులపట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం మెడలు వంచే కార్యక్రమాల రూపకల్పన జరగాలని, గ్రామ స్థాయిలో మరో ఉద్యమం వస్తేనే కేంద్రానికి గుణపాఠం చెప్పినట్టవుతుందని చంద్రశేఖర్ రావు దర్నాచౌక్ వేదికగా పిలుపునిచ్చారు.

ధర్నాచౌక్ టూ రాజ్ భవన్ వయా ఢిల్లీ.. రైతు సమస్యలపై కేసీఆర్ రూట్ మ్యాప్ రెఢీ
వరి కొనుగోలు అంశంపై కేంద్ర బీజేపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు చంద్రశాఖర్ రావు. రైతులను అరిగోస పెడుతోందని కేంద్ర బీజేపి ప్రభుత్వంపై పచ్చి ఆరోపణలు చేసారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని, చెట్లకు రైతన్నల శవాలు వేలాడే పరిస్థితులు తలెత్తాయని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో యుద్దం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలోని ప్రతి రైతు అందుకు సంసిద్దం కావాలని చంద్రశేఖర్ రావు ధర్నాచౌక్ వేదిక నుండి పిలుపునిచ్చారు. అంతే కాకుండా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కూడా తమ పరిస్థితి వివరిస్తానని చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

ఇక తగ్గేది లే.. కేంద్రంతో యుద్దమేనన్న కేసీఆర్..
అంతే కాకుండా తెలంగాణలో నెలకొన్న రైతు సంక్షోభం, విరిధాన్యం కొనుగోలు, రైతన్న దయనీయ పరిస్ధితులు, యాసంగి పంట, ధాన్యం నిలవలు తదితర అంశాను గవర్నర్ తో చర్చిస్తామని చంద్రశేఖర్ రావు ప్రకటిచారు. ఇందిరా పార్క్ నుండి నేరుగా రాజ్ వెళ్లనున్నట్టు తెలిపారు. గవర్నర్ తో చర్చించిన తర్వాత ఢిల్లీతో పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అంతే కాకుండా యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్దం నడుసున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థిని రైతుల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఇరు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

గవర్నర్ తో చర్చింస్తామన్న సీఎం.. తర్వాత ఢిల్లీలో తేల్చకుంటామన్న కేసీఆర్
అదీ కాకుండా మీరే రైతులను ముంచుతున్నారని కమలం పార్టీ అంటుంటే, మీరే ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటూ నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు సీఎం చంద్రశాఖర్ రావు ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు చంద్రశేఖర్ రావు స్వయంగా ఢిల్లీ ధర్నాలో పాల్గొనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

వరి జగడం జంతర్ మంతర్ వరకూ.. కేంద్రం రియాక్షన్ కోసం టీఆర్ఎస్ ఎదురుచూపు..
ఈ నెల 29న దీక్ష దివస్ సందర్భంగా సీఎం చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ధర్నా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే మంచి తరుణమని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో గానీ ప్రగతి భవన్ లో గాని పార్టీ ముఖ్య నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకొబోతున్నట్టు తెలుస్తోంది. వరి ధాన్యం కొనుగోలు అంశమే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా మారనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగట్టేలా పార్టీ శ్రేణులకు చంద్రశేఖర్ రావు దిశా నిర్దేశం చేయనున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications