రేవంత్ రెడ్డిపై కేసీఆర్ తొలివిజయం!!
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్తు కొనుగోళ్ళు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ పైన మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ విచారించిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
విద్యుత్ కొనుగోళ్ళ అంశంలో కేసీఆర్ తరపు వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ
విద్యుత్ కొనుగోళ్ల అంశంలో వేసిన విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాల్సిందేనని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలో రేవంత్ సర్కార్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని విద్యుత్తు కొనుగోళ్ళు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై వేసిన కమిషన్ పైన నేడు కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు.

జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పై బలంగా వాదన
విద్యుత్ విచారణ కమిటీ నియామకంలో పరిధిని అతిక్రమించారని ఆయన ధర్మాసనం ముందు పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఉండగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పైన కూడా ఆయన తనదైన వాదనలు ఆధారాలతో సహా వినిపించారు. ముఖ్యంగా ఆయన విచారణ జరగక ముందే పెట్టిన ప్రెస్ మీట్ పై ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
విచారణ జడ్జిని మార్చేందుకు తెలంగాణా ప్రభుత్వం ఓకే
న్యాయం చెప్పాల్సిన జడ్జి విచారణకు ముందే ప్రెస్ మీట్ ఎలా పెడతారు అంటూ సీ జే ఐ ప్రశ్నించారు. దీంతో సిజేఐ ఆదేశాలతో విచారణ జడ్జిని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. సిజెఐ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టు అయింది. కొత్త జడ్జి ఎవరైనా దానిపై మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చింది సుప్రీం ధర్మాసనం.
రేవంత్ షాకిచ్చి కేసీఆర్ తొలివిజయం
దీంతో కలెక్టర్ల మీటింగ్ నుంచి చాంబర్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త జడ్జి ఎవరు అన్న అంశంతో సహా, ప్రస్తుతం ఉన్న కమిషన్ పైన సుప్రీంకోర్టు అభ్యంతరాలు, కేసీఆర్ తరపు న్యాయవాది లేవనెత్తిన పాయింట్స్ పైన చర్చిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఒక గొప్ప విజయం దక్కింది. రేవంత్ రెడ్డి సర్కార్ పైన పోరాటం చేసిన కేసీఆర్ విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంలో వేసిన కమిషన్ పైన సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణా ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ తొలి విజయాన్ని అందుకున్నారు.












Click it and Unblock the Notifications