వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశానికి ‘అదానీ’ ముప్పు అంటూ మోడీపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన కేసీఆర్

అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతూ ప్రధాని మోడీపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్.

|
Google Oneindia TeluguNews

నాందేడ్: దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) లక్ష్యమని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా అభివృద్ధి సాధిస్తున్నాయని.. కానీ, అన్న వనరులున్న భారత్ ఎందుకు అభివృద్ధి సాధించడం లేదని ప్రశ్నించారు. నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ పూర్తయిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికీ నీటి యుద్ధాలెందుకంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్

ఇప్పటికీ నీటి యుద్ధాలెందుకంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్

దేశంలో ప్రజలకు సరిపడా సహజ వనరులున్నాయన్నారు. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తోంది. దేశంలో సాగు కోసం 40 వలే టీఎంసీలు సరిపోతాయి. ప్రభుత్వం తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వవచ్చని కేసీఆర్ చెప్పారు. దేశంలో జల విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నీటి వినియోగంలో బీఆర్ఎస్ ఎజెండా విప్లవాత్మకంగా ఉంటుందన్నారు.

2004లో వేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటి వరకు నీటి వాటాలు తేల్చలేదని కేసీఆర్ అన్నారు. ఇప్పటికీ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు? సరిపడా జలాలు ఉన్నా.. రాష్ట్రాలు ఎందుకు కొట్టుకుంటున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు.

భారీ రిజర్వాయర్ల గురించి కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదన్నారు. దేశ ప్రగతి కోసం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు కావాలన్నారు. మన దేశానికి 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉందని, అయినా అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీరు లేదని, విద్యుత్ కొరత ఉందని చెప్పారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. న్యూయార్క్, లండన్ నగరాల్లో కరెంటు పోవచ్చు గానీ.. హైదరాబాద్‌లో పోదని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను పవర్ హైలాండ్‌గా మార్చామని చెప్పారు.

ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయొద్దు మోడీ?: కేసీఆర్

ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయొద్దు మోడీ?: కేసీఆర్

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనుకబడి ఉందని.. ఇందుకు ప్రభుత్వ నాయకులంతా సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడపడమేనని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జల విధానం పూర్తిగా మార్చేస్తామని, దేశంలో భారీ నీటి ప్రాజెక్టులను నిర్మిస్తామని చెప్పారు. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదని మోడీ చెబుతున్నారని.. ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని కేసీఆర్ ప్రశ్నించారు.

ప్రైవేటీకరణ పేరుతో లాభాల్లో ఉన్న సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇప్పటి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రభుత్వంలోకి తీసుకొస్తామన్నారు. దేశంలో బొగ్గు విస్తారంగా ఉన్నా.. విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామని ప్రశ్నించారు. దేశంలో ఉన్న బొగ్గుతోనే 24 గంటల విద్యుత్ ఇవ్వవచ్చని కేసీఆర్ చెప్పారు.

దేశానికి ‘అదానీ' ముప్పు అంటూ మోడీపై కేసీఆర్ విమర్శలు

దేశానికి ‘అదానీ' ముప్పు అంటూ మోడీపై కేసీఆర్ విమర్శలు

ప్రధాని మోడీతోపాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై విమర్శలు చేశారు కేసీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతుండగా.. దాన్ని ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు.

సాధారణ వ్యాపారి అయిన అదానీ.. రెండేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో మూడోస్థానానికి ఎలా ఎదిగారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలన్నారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ మిత్రుడైన అదానీని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అదానీపై ఉన్న ప్రేమ దేశం ప్రజలపై ఉండాలన్నారు. కేంద్రం అదానీ, అంబానీ, జిందాల్ పాటపాడుతోందని విమర్శించారు. అదానీ అసలు రంగు బయటపడిందని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెనుముప్పు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసినా.. తిరిగి తాము జాతీయం చేస్తామన్నారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. మహిళలు ప్రాతినిథ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుందని కేసీఆర్ తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. భేటీ పడావో.. భేటీ బచావో మాటలకే పరిమితమైందని కేంద్రం విమర్శలు గుప్పించారు. హథ్రస్ లాంటి ఘటనలు దేశంలో మహిళలకు రక్షణ లేదని నిరూపించిందన్నారు. దేశంలో అన్ని వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు.

English summary
KCR hits out at pm modi on adani issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X