వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటుకు ఓటు: గవర్నర్‌తో కెసిఆర్, స్టీఫెన్‌సన్ వాంగ్మూలం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నోటుకు ఓటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. టిడిపి తెలంగాణ నేత వేం నరేందర్ రెడ్డిని ఎసిబి విచారిస్తున్న నేపథ్యంలో పరిణామాలను ఆయన గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం

ఓటుకు నోటు కేసులో నోటీసుల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకువచ్చారు. త్వరలోనే చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు ఎంపీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, ఓటుకు నోటు కేసులో నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇచ్చారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన కూతురు జెస్సికా, ఇంటి యజమాని టేలర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద కోర్టు వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

ఓటుకు నోటు కేసులో సంభవిస్తున్న పరిణామాలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారంనాడు గవర్నర్‌ను కలిశారు.

రాజభవన్‌కు కెసిఆర్

రాజభవన్‌కు కెసిఆర్

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వివరాలను అందించి, తదుపరి చర్యలను గవర్నర్‌కు తెలియజేయడానికి రాజభవన్ వచ్చారు.

బుల్లెట్ ప్రూఫ్ కారులో..

బుల్లెట్ ప్రూఫ్ కారులో..

స్టీఫెన్‌సన్ సికింద్రాబాదులోని బోయిగుడా ప్రాంతంలోని తన నివాసం నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో కూతురు జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్‌లతో కలిసి కోర్టుకు వచ్చారు.

స్టీఫెన్ సన్ వాంగ్మూలం కీలకం

స్టీఫెన్ సన్ వాంగ్మూలం కీలకం

నోటుకు ఓటు కేసుోల కేసులో స్టీఫెన్‌సన్ వాంగ్మూలం కీలకంగా మారింది. స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇస్తున్న సమయంలో కోర్టు లోపల, బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Telangana CM K chandrasekhar Rao met governor Narasimhan ta Rajbhavan. Meanwhile, ACB recorded MLA Stephenson's statement at Nampally court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X