కొడంగల్‌లో టిఆర్ఎస్ వ్యూహమిదే: రేవంత్‌కు అగ్ని పరీక్షేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆమోదం పొంది కొడంగల్ ఉపఎన్నిక జరిగితే రాజకీయంగా రేవంత్‌రెడ్డిని దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన కొడంగల్ నియోజకర్గం నుండి టిడిపి కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున టిఆర్ఎస్‌లో చేరారు. ఈ నియోజకవర్గంపై ముగ్గురు మంత్రులు కేంద్రీకరించారు.

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: ఆ ముగ్గురిపైనే అందరి దృష్టి

కొడంగల్ ఉప ఎన్నిక కోసం అధికార టిఆర్ఎస్‌ ఎదురుచూస్తోంది. నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికను సృష్టించుకొనే బదులుగా.. కొడంగల్ ఉప ఎన్నికతోనే విపక్షాలతో పాటు రేవంత్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని టిఆర్ఎస్ వ్యూహలు రచిస్తోంది.

వారిద్దరూ స్నేహితులు: నరేందర్‌‌రెడ్డి కోసం కేసులోకి రేవంత్

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి చేరనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి వెంట మరికొందరు నేతలు కూడ వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే సోమవారం నాడు జల విహార్‌లో రేవంత్‌రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు నేతలు రేవంత్‌తో పాటు పాల్గొనే అవకాశం లేకపోలేదు.

నాడు ఎమ్మెల్సీకి, నేడు ఎమ్మెల్యేకు రేవంత్‌ రాజీనామా: గెలిస్తేనే అసెంబ్లీకి

కొడంగల్‌లో టిఆర్ఎస్ వ్యూహమిదే

కొడంగల్‌లో టిఆర్ఎస్ వ్యూహమిదే


కొడంగల్ అసెంబ్లీ నియోజకర్గంలో రేవంత్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ పావులు కదుపుతోంది. కొంత కాలం నుండి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది. టిడిపికి చెందిన ముఖ్యనాయకులపై టిఆర్ఎస్‌ వల వేసింది. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి చేరనున్నారు.అయితే ఇటీవల కాలంలో టిఆర్ఎస్ నేతలు ఈ నియోజకవర్గం నుండి కొందరు టిడిపి ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్‌లో చేరారు.ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. కొడంగల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగితే రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది..రేవంత్‌రెడ్డి రాజకీయంగా దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీకి కూడ రాజకీయంగా ఇబ్బందికరపరిస్థితులు వచ్చే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కెసిఆర్ ప్రత్యేక దృష్టి

కెసిఆర్ ప్రత్యేక దృష్టి

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి లేదా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డిని బరిలోకి దింపాలని టిఆర్ఎస్ భావిస్తోంది. రేవంత్‌రెడ్డిని ఉపఎన్నికల్లో ఓడిస్తే రాజకీయంగా రేవంత్‌‌కు చెక్ పెట్టాలని టిఆర్ఎస్ భావిస్తోంది. కొడంగల్ అసెంబ్లీ నియోజకర్గంలోని మండలాలు కూడ మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలకు మారాయి. దీంతో ఆయా జిల్లాలోని టిఆర్ఎస్ నాయకులు చాలా కాలంగా ఈ నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ పనులను పర్యవేక్షిస్తున్నారు.కెసిఆర్ కూడ ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కేంద్రీకరించారు.

రేవంత్‌కు అగ్నిపరీక్షే

రేవంత్‌కు అగ్నిపరీక్షే

కొడంగల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక రేవంత్‌రెడ్డికి అగ్నిపరీక్ష కానుంది. ఉప ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో రేవంత్‌ను ఓడించేందుకు టిఆర్ఎస్ అన్ని రకాల వ్యూహలను అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు టిడిపి కూడ ఈ ఎన్నికల్లో రేవంత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం లేకపోదంటున్నారు పరిశీలకులు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రావడాన్ని స్థానిక క్యాడర్‌ ఏ రకంగా స్వాగతిస్తోందో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి వర్గీయులు ఉన్నారు. ప్రస్తుతం గుర్నాధరెడ్డి టిఆర్ఎస్‌లో ఉన్నారు.అయితే ఈ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ప్రత్యర్థి పార్టీల నుండి గట్టిపోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కొడంగల్‌లో టిడిపి ఇలా...

కొడంగల్‌లో టిడిపి ఇలా...

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ఏ రకమైన వ్యూహరచన చేయనుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ుండి 1999 ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే నందారం సూర్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాధరెడ్డిపై విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికే సూర్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తర్వాత ఉప ఎన్నికల్లో సూర్యనారాయణ భార్య అనురాధ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో అనురాధ కుటుంబసభ్యులతో రేవంత్‌రెడ్డి ఒప్పించి , కొడంగల్ టిక్కెట్టును తెచ్చుకొన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఉపఎన్నిక జరిగితే టిడిపి కూడ రేవంత్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. అయితే టిడిపి నుండి ఇప్పటికే ముఖ్యమైన నేతలు టిఆర్ఎస్‌లో చేరారు. మరికొందరు రేవంత్ వెంట వెళ్ళే అవకాశం ఉంది. .

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS strategy on Kodangal assembly segment.Ministers and TRS key leaders concentrated on Kodangal segment . KCR planning for political gain in Kodangal bypoll.
Please Wait while comments are loading...