విపక్షాల కథ క్లోజ్, 104సీట్లు మనవే: నేతపై కేసీఆర్ ఫైర్, ఎన్నారైని కొట్టిన ఫరూక్‌ది తప్పులేదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదే అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పటికీ మనం ఏమరుపాటున ఉండవద్దని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.

పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించే విషయం కెసిఆర్ చెప్పారు. సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్న కొందరు ఇంచార్జులు ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. టిక్కెట్ల కోసం టిఆర్ఎస్ భవన్‌కూ ఎవరూ రావొద్దన్నారు.

తెలంగాణ టిడిపి నేతలకు రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే జవాబు

అన్ని సర్వేలు మనకే అనుకూలం

అన్ని సర్వేలు మనకే అనుకూలం


ఎన్నికలు వస్తే మన పార్టీకి 95 నుంచి 104 మధ్య సీట్ల వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు అంతా ప్రిపేరై అసెంబ్లీకి రావాలని సూచించారు. విపక్షాలు ఏం అడిగినా సమాధానం చెప్పేలా ఉండాలన్నారు.

విపక్షాల కథ ముగిసింది

విపక్షాల కథ ముగిసింది

రాష్ట్రంలో విపక్షాల కథ ముగిసిందని కేసీఆర్ చెప్పారు. వాళ్ల వద్ద ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వారి వద్ద ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ మనం అజాగ్రత్తగా ఉండవద్దని, అలర్ట్‌గా ఉండాలని కేసీఆర్ చెప్పారు.

ఫారూక్ హుస్సేన్ తప్పులేదు

ఫారూక్ హుస్సేన్ తప్పులేదు

ఇటీవల ఎన్నారై మహిళని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ కొట్టడంపై కేసీఆర్ స్పందించారు. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్సీపై ఆగ్రహం

ఎమ్మెల్సీపై ఆగ్రహం

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిపై పదేపదే ఫిర్యాదు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహారాల్లో ఎమ్మెల్సీలకు ఏం పని అని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Thursday said that TRS will win 95 to 104 seats in next elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి