ఏపీ యువకుడి ప్రేమలో ప్రత్యూష: కరీంనగర్ పర్యటన అనంతరం కెసిఆర్ నిర్ణయం
హైదరాబాద్: తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రత్యూషను ప్రస్తుతానికి ఆ యువకుడితో కలవనీయవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల నుంచి మహిళా, శిశు సంక్షేమ విభాగం అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.
అతడితో కనీసం మాట్లాడనీయవద్దని కూడా ఆదేశించినట్టు సమాచారం. ప్రత్యూష బాగోగులు స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నందున.. ఈ విషయంలో ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలని అధికారులు నిర్ణయించారు.
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని ప్రేమించానని, అతనితో తన పెళ్లి జరిపించాలని ప్రత్యూష కోరిన సంగతి తెలిసిందే.

కాగా, ప్రత్యూష పెళ్లిని తానే స్వయంగా జరిపిస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో కరీంనగర్ పర్యటన అనంతరం ప్రత్యూష ప్రేమ విషయమై కేసీఆర్ ఓ నిర్ణయానికి రావచ్చని అధికారులు చెబుతున్నారు. హైకోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోంది.
అంతకుముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. సవతి తల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష విషయం ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా బయటికి వచ్చింది. దీంతో హైకోర్టు సుమోటా తీసుకుని ఆమె సంరక్షణను ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. కాగా, సీఎం కెసిఆర్ ముందుకు వచ్చి ఆమెకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, పెళ్లి అన్ని విషయాలను తానే స్వయంగా చూసుకుంటానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications