అస్త్ర శస్త్రాలతో రేవంత్ సర్కార్ పై వార్ ప్రకటించనున్న కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయాలని, ప్రజల మద్దతు చూరగొనడానికి ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారు . మొన్నటి వరకు కవిత అరెస్టుతో సైలెంట్ అయిన కెసిఆర్ ప్రస్తుతం కవితకు బెయిల్ లభించడంతో మళ్లీ ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయాలని ప్రజలలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. దీనికోసం అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఎన్నికల ఓటమి, కవిత అరెస్ట్ తో కుదేలైన బీఆర్ఎస్
గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించడం, ఆపై సిబిఐ కూడా రంగంలోకి దిగి కవితను టార్గెట్ చేసి గత ఐదు నెలలుగా జైలులోనే ఉండేలా చేయడం బిఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ. కవిత అరెస్టు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలలో కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

KCR will declare war on Revanth reddy govt with districts tour

జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్న కేసీఆర్
దీంతో సైలెంట్ అయిన కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పరిమితమై సమయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా కవితకు బెయిల్ లభించడంతో మళ్లీ జిల్లాల పర్యటన చేయాలని కెసిఆర్ రెడీ అవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ వల్ల రైతులు పూర్తిస్థాయిలో లబ్ధి పొందలేకపోయారని భావిస్తున్న కేసీఆర్ ప్రజలలోకి వెళ్లి రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రంగంలోకి కేసీఆర్
అంతే కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి కేడర్ లో ఉత్తేజం నింపడానికి కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారని సమాచారం. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు తోపాటు పార్టీలోని పలువురు కీలక నేతల ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తున్నప్పటికీ ప్రజల నుండి పెద్దగా స్పందన రావడం లేదని భావిస్తున్న క్రమంలోనే కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.

కవిత బయటకు వచ్చాక కేసీఆర్ దూకుడు ఎలా ఉంటుందో ?
ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కెసిఆర్ వార్ ప్రకటించినట్టు, ఇకనుండి దూకుడుగా పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే కవిత బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ దూకుడు ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+