మహారాష్ట్రను వదిలిపెట్టని కేసీఆర్; మరో భారీ బహిరంగసభ.. ముహూర్తం ఎప్పుడంటే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి మహారాష్ట్ర పై ఫోకస్ చేస్తున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలను నిర్వహించారు. మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించారు. ఇక తాజాగా మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు గులాబీ అధినేత కేసీఆర్ ప్లాన్ చేశారు.
ఏప్రిల్ 24వ తేదీన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 5వ తేదీన నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్, మార్చి 26వ తేదీన మహారాష్ట్రలోని కందర్ లోహాలో బహిరంగ సభను నిర్వహించారు.

మళ్లీ నెలరోజుల వ్యవధిలోనే ప్రస్తుతం ఏప్రిల్ 24వ తేదీన ఔరంగాబాద్ లో భారీ బహిరంగసభను నిర్వహించడం కోసం రెడీ అయ్యారు. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ పదేపదే మహారాష్ట్ర పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్, ముందుగా సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు.
అయితే మహారాష్ట్రలో ఉన్న రాజకీయ అనిశ్చితి కారణంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం దొరుకుతుందని భావిస్తూ ఆయన ప్రధానంగా మహారాష్ట్ర పైనే ఫోకస్ చేస్తున్నారు. మహాలో గతంలో బలంగా ఉన్న శివసేన చీలిక రావడంతో మహారాష్ట్రలో శివసేన బలహీన పడింది. మహారాష్ట్రలో బిజెపి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాంగ్రెస్, ఎన్సిపి లు కూడా మహారాష్ట్రలో అంత బలంగా కనిపించడం లేదు.

దీంతో అక్కడ బలోపేతం కావాలని సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అక్కడ చాలా పార్టీల నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మహారాష్ట్ర బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఔరంగాబాద్ సభ ఏర్పాట్లు చూడాలని చెప్పారని సమాచారం. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ కమిటీలను ప్రకటించింది. పార్టీ కన్వీనర్ తో పాటు పలు కమిటీలను ఏర్పాటు చేసింది.
అన్ని రాజకీయ పార్టీల నుండి పలువురు నేతలను గులాబీ కండువా కప్పుకోవటానికి ఆహ్వానించింది. మహారాష్ట్రలో రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్న బీఆర్ఎస్ ఈ మేరకు మహారాష్ట్రలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.












Click it and Unblock the Notifications