కెల్విన్ అమాయకుడు: సిట్‌కు లాయర్ సవాల్!, '1960 నుంచి వాడకమని..'
డ్రగ్స్ రాకెట్ కేసులో కెల్విన్ (కాల్విన్) అమాయకుడని, ఆయనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన తరఫు లాయర్ రేవంత్ సోమవారం అన్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ కేసులో కెల్విన్ (కాల్విన్) అమాయకుడని, ఆయనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన తరఫు లాయర్ రేవంత్ సోమవారం అన్నారు.
కెల్విన్ అసలు డ్రగ్స్ అమ్ముతున్నాడన్నది అవాస్తవమని చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కెల్విన్ ముఠా అని ప్రశ్నించగా.. ముఠా అంటే ఏమిటని అడిగారు. గ్యాంగ్ అని విలేకరి చెప్పారు.
దానికి అకున్ ముఠా అని కెల్విన్ లాయర్ అన్నారు. అకున్ ముఠా అంటున్నారు అని ప్రశ్నించగా.. ముఠా అంటే గ్యాంగ్ అని మీరే చెప్పారుగా అని అన్నారు. కెల్విన్‌ను వారి తల్లిదండ్రులను కూడా కలవనీయడం లేదని ఆరోపించారు.

సాక్ష్యాలు ఉంటే బయటపెట్టండి
తమ వద్ద సాక్ష్యాలు ఉంటే సిట్ వాటిని బయటపెట్టాలని కెల్విన్ లాయర్ డిమాండ్ చేశారు. సిట్ ఒక్క సాక్ష్యం కూడా కోర్టుకు ఇవ్వలేదని చెప్పారు. సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలన్నారు. అసలు అందరూ కెల్విన్.. కెల్విన్ అంటున్నారని.. కానీ అతని పేరు కాల్విన్ అని చెప్పారు. కెల్ి

మాకే సినిమా చూపిస్తున్నారు
డ్రగ్స్ వ్యవహారంలో సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేసారు. నేతలు, పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇందులో ఉన్నారన్నారు.

1960 నుంచి డ్రగ్ వాడకం..
1960 నుంచి డ్రగ్ వాడకం ఉందని నారాయణ మూర్తి అన్నారు. కేవలం సినిమా వాళ్లే వాడుతున్నారని భ్రమలు కల్పిస్తున్నారన్నారు. డ్రగ్ కల్చర్‌ను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మూలాలు వెతికి పట్టుకోవాలన్నారు. పిల్లలు కూడా డ్రగ్స్ వాడటం బాధాకరమన్నారు.

ప్రముఖ నటి మేనేజర్ అరెస్ట్
డ్రగ్ కేసులో ప్రముఖ నటి మేనేజర్ రోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. మణికొండలోని ఆయన ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఇంట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాను గంజాయిని వాడుతున్నట్టు రోనీ ఒప్పుకున్నట్టుగా సమాచారం. చాలా కాలంగా రోనీ డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రోనీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తే, అన్ని విషయాలు బయటపడతాయంటున్నారు. గతంలో ఇతను మరో ఇద్దరు హీరోయిన్లకు మేనేజర్‌గా పని చేశాడు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications