నా నిర్ణయం ఇదే.. కేసీఆర్ కు తెగేసి చెప్పిన కవిత!
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కటం లేదని, తన పైన కుట్రలు చేస్తున్నారని బాహాటంగా వాపోయిన కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో చెప్పాలంటూ కవిత డిమాండ్ చేశారు. కెసిఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళే దెయ్యాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రసవత్తరంగా బీఆర్ఎస్ రాజకీయం
ఒకరకంగా అన్న కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత తనదైన వ్యాఖ్యలు చేశారు. ఇక కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ అంతర్గత విషయాలను అంతర్గతంగా చర్చించాలంటూ ఇన్ డైరెక్ట్ గావ్యాఖ్యానించారు. ఆపై కవిత కొత్త పార్టీ పెడతారని జరుగుతున్న చర్చ, తెలంగాణ జాగృతి నేతలతో కవిత నిర్వహిస్తున్న సమావేశాలు వెరసి బి ఆర్ ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

కవిత వద్దకు కెసిఆర్ దూతలు
మొన్నటికి మొన్న కేటీఆర్, కెసిఆర్ తో భేటీ అయ్యి కవిత వ్యవహారం పైన చర్చించారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలకు కవిత వ్యవహారం పైన ఎవరూ మాట్లాడవద్దని అంతర్గతంగా సూచించారు. ఇక అన్న చెల్లెలు పంచాయితీపైన తెలంగాణ రాజకీయాలలో రచ్చ కొనసాగుతున్న వేళ, బీఆర్ఎస్ పార్టీలోను గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటిపోతున్న క్రమంలో కవిత వద్దకు కెసిఆర్ తన దూతలను పంపించారు.
కేసీఆర్ కు తెగేసి చెప్పిన కవిత
కవితకు గల అసంతృప్తికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనేక అంశాలపైన చర్చించిన తర్వాత వీరి చర్చలు విఫలమైనట్టు తెలుస్తుంది. తనకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేకుంటే తన దారి తాను చూసుకుంటానని కవిత కెసిఆర్ కి చెప్పినట్లుగా సమాచారం. కొత్తపార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం. బీఆర్ఎస్ లో కవితకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఆ పార్టీలో ఆమె ఉండాలని అనుకోవడం లేదని కవిత అనుచరులు కూడా చెబుతున్నారు.
కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించటం లేదు
ఈ క్రమంలోనే కవిత వరుసగా తెలంగాణ జాగృతి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కమిటీలను వేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఇక కవిత జూన్ రెండవ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించటం లేదని, ఈ క్రమంలోనే కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతున్న వేళ, పార్టీలో ప్రాధాన్యం విషయాల్లో కవిత తండ్రికి తెగేసి చెప్పినట్టు ప్రస్తుతం చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications