ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల చేతిలో ఫోరెన్సిక్ రిపోర్ట్; అందులో ఏముంది?

కేఎంసీ పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసులు చేతికి చేరిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసును కీలక మలుపు తిప్పుతుందా.. ప్రీతిది హత్యనా .. ఆత్మహత్యనా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.

కాకతీయ మెడికల్ కళాశాల పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి మృతి పైన అనేక అనుమానాలు వ్యక్తమై, ఆత్మహత్య కాదు హత్య అని ప్రీతి కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల చేతికి చేరిన ఫోరెన్సిక్ రిపోర్టు ప్రీతి కేసులో కీలకంగా మారింది.

పోలీసుల చేతికి ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్

పోలీసుల చేతికి ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్


తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రీతి మృతి కేసులో దూకుడు పెంచిన పోలీసులు ఇప్పటికే ప్రీతి మృతికి కారణమైన నిందితుడు సైఫ్ ను గత రెండు రోజులుగా కస్టడీ లోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పోలీసులు చేతికి చేరిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రీతి కేసును కీలక మలుపు తిప్పుతుందా.. అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ఆధారంగా చేసిన ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్టును పోలీసులు నేడు స్వాధీనం చేసుకున్నారు.

ప్రీతిది ఆత్మహత్యనా? హత్యనా? రిపోర్ట్ లో ఏముంది

ప్రీతిది ఆత్మహత్యనా? హత్యనా? రిపోర్ట్ లో ఏముంది

ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్టును కూడా తీసుకున్న పోలీసులు, నేడు ఈ రిపోర్ట్ లో కీలక అంశాలను బయటపెట్టే అవకాశం ఉంది. అసలు ఇప్పటికైనా ప్రీతి మృతికి కారణమైన హానికరమైన ఇంజక్షన్ ఏమిటి అనేది బయటకు వస్తుందా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రీతిది ఆత్మహత్యనా? హత్యనా? అనే అనుమానాలకు పోలీసుల చేతికే అందిన ఫోరెన్సిక్ రిపోర్టుతో తెరపడనుంది. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, తమ కూతురిని సైఫ్ హత్య చేశాడని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పించారు.

ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ కేసును కీలక మలుపు తిప్పుతుందా?

ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ కేసును కీలక మలుపు తిప్పుతుందా?

తమ వద్ద ఉన్న ఆధారాలను తాము పోలీసులకు కూడా పంపించామని చెప్పారు. ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చి చనిపోయిందనుకొని సైఫ్ వెళ్లిపోయాడని, అయితే అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని తోటి సిబ్బంది హాస్పిటల్ కి తరలించారని వారు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ కేసును కీలక మలుపు తిప్పుతుందా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రీతి మృతి పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో పోలీసుల చేతికి అందిన ఫోరెన్సిక్ రిపోర్టులో ఏముంది? పోలీసులు ఏమి చెప్పబోతున్నారు? అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ గా మారింది.

గవర్నర్ కు త్వరలోనే అన్ని వివరాలను నివేదిస్తామన్న కేఎంసీ ప్రిన్సిపల్

గవర్నర్ కు త్వరలోనే అన్ని వివరాలను నివేదిస్తామన్న కేఎంసీ ప్రిన్సిపల్


ప్రీతి మృతికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళ సై కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ మోహన్ దాస్ కు రాసిన లేఖ నేపథ్యంలో, గవర్నర్ ఆదేశాల మేరకు, గవర్నర్ ప్రీతి మృతి కేసులో అడిగిన అన్ని వివరాలను నివేదిస్తామని కేఎంసి ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు ముందు కేఎంసీలో, ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగింది? ప్రీతికి కౌన్సిలింగ్ నిర్వహించిన వైద్యులు ఎవరు? ప్రీతి ఆత్మహత్యకు హానికరమైన ఇంజక్షన్ తీసుకోవడమే కారణమా? ఎవరి సూచనతో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు? ఈ ఐదేళ్ల కాలంలో కాకతీయ మెడికల్ కళాశాలలో ఏమైనా ర్యాగింగ్ ఘటనలు జరిగాయా? కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? వంటి వివరాలను గవర్నర్ కోరగా వాటిని త్వరలోనే గవర్నర్ కు నివేదిస్తామని కేఎంసి ప్రిన్సిపల్ చెబుతున్నారు.

మూడోరోజు కొనసాగుతున్న సైఫ్ విచారణ

మూడోరోజు కొనసాగుతున్న సైఫ్ విచారణ


కాగా నేడు మూడవరోజు ప్రీతి మృతి కేసు నిందితుడు సైఫ్ ను మట్టెవాడ పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ప్రీతి మొబైల్ ఫోన్ లోని స్క్రీన్ షాట్ ల ఆధారంగా, వాట్సప్ చాటింగ్ ల ఆధారంగా సైఫ్ నుండి కీలక వివరాలు సేకరిస్తున్న పోలీసులు, ఈ కేసులో వాట్సప్ లో ప్రీతి గురించి సైఫ్ తో చాట్ చేసిన మరికొందరు మెడికో లను సైతం విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+