ఉప్పల్ నరబలి కేసులో కీలక ఆధారాలు: గదిలో రక్తపు మరకలు, కోడిని కోశామంటూ..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఉప్పల్ నరబలి కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. వారు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే క్యాబ్ డ్రైవర్, భవన యజమాని రాజశేఖర్‌ను కీలక నిందితుడిగా భావిస్తున్నారు.

  Human Sacrifice Baby's Head Case Mystery Solved

  అయితే మొండెం రికవరీ కాకపోవడంతో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను ఆశ్రయించారు. మరోవైపు, రాజశేఖర్ ఇంటిని ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీ పరిశీలించింది. ఓ గది నిండా రక్తపు మరకలు గుర్తించారు.

  ఉప్పల్ నరబలి: కేసులో కొత్త మలుపు?.. ఏది నిజం?.. అసలేం జరుగుతోంది..

  గది నిండా రక్తపు మరకలు

  గది నిండా రక్తపు మరకలు

  రాజశేఖర్ ఇంటిలోని ఓ గదిలో గది నిండా రక్తపు మరకలు గుర్తించిన క్లూస్ టీం... ఆ రక్తపు మరకలను వివిధ రకాల రసాయనాలతో తుడిచి వేశారని గుర్తించారు. అయిదుసార్లు వాటిని తుడిచారని అనుమానించిన అధికారులు, రాజశేఖర్ ఇంట్లో లభించిన పలు నమూనాలను సేకరించారు.

  డీఎన్ఏ రిపోర్ట్ కీలకం

  డీఎన్ఏ రిపోర్ట్ కీలకం

  ఇంటిపై లభించిన శిశువు తలలోని డీఎన్ఏను సేకరించామని, వీటిని పోలుస్తూ నివేదిక తయారయితే అసలు నిజం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక రేపు రానుందని, ఇందులో డీఎన్ఏ రిపోర్ట్ కీలకమని చెప్పారు.

  రిపోర్ట్ వచ్చాక 48 గంటల్లో మిస్టరీ ఛేదన

  రిపోర్ట్ వచ్చాక 48 గంటల్లో మిస్టరీ ఛేదన

  నివేదిక రాగానే 48 గంటల్లో కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా, గదిలో రక్తపు మరకలు, వాటిని రసాయనాలతో తుడిచినట్లు క్లూస్ టీం గుర్తించడంతో ఇంటి యజమాని రాజశేఖర్‌ను వాటి గురించి అడిగారు. ఆ గదిలో కోడిని కోసినట్లు నిందితుడు చెప్పాడు.

  క్షుణ్ణంగా ఇంటి పరిశీలన

  క్షుణ్ణంగా ఇంటి పరిశీలన

  పోలీసులు తొమ్మిది గంటల పాటు రాజశేఖర్ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో భాగంగా శనివారం కీలక ఆధారాలు గుర్తించారు. తొలుత అత్యాధునిక పరికరాలు కూడా రక్తాన్ని గుర్తించలేకపోయాయని తెలుస్తోంది. ఆ తర్వాత గుర్తించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Uppal Human Sacrifice mystery cracked. Key evidence found in Uppal Human sacrifice case on Saturday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి