ఖైరతాబాద్ గణపతి రికార్డ్
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటలకు పూర్తయింది. పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న మహా గణపతికి ఉదయం పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గణపతిని కదిలించారు. ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. గతంలో కంటే భిన్నంగా, రికార్ట్ సమయంలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయింది. ఉదయం ఆరు గంటలకు శోభాయాత్రగా బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నిమజ్జనం అయింది.












Click it and Unblock the Notifications