Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ; వారేమన్నారంటే!!

సికింద్రాబాద్ ఎంపీ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హోం శాఖ సహాయమంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాకు 2శాఖల బాధ్యతలు ఇచ్చారని ఈ మేరకు ఈరోజు బొగ్గు మరియు మైనింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని ఆయన తెలిపారు.

ప్రజల జీవితాల్లో విద్యుత్ రంగం చాలా కీలకమైంది: కిషన్ రెడ్డి
ఈ శాఖలో గతంలో ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్ వంటివారు పనిచేశారని, ఈ కీలకమైన శాఖలో ప్రస్తుతం తాను ప్రజలందరూ మెచ్చే విధంగా పనిచేయాలని భావిస్తున్నానన్నారు. ప్రజల జీవితాల్లో విద్యుత్ రంగం చాలా కీలకమైందని పేర్కొన్న కిషన్ రెడ్డి, పదేళ్లక్రితం దేశంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, కరెంటు, నీళ్ల కొరత కారణంగా పంటలు ఎండిపోయిన పరిస్థితులను చూసామని, హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలు ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.

kishan reddy and bandi sanjay took charge as union ministers started focus on their duties

బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఫోకస్ చేస్తా: కిషన్ రెడ్డి
అయితే పదేళ్ల కాలంలో మోడీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టి, పరిశ్రమలకు, గృహాలకు, వ్యవసాయానికి సరిపోను కరెంటును అందిస్తున్నారన్నారు. దీనికి ప్రధానకారణం బొగ్గు అంటూ పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి దేశంలో ఎక్కువగా జరుగుతుందని, రానున్నరోజుల్లో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న ఖనిజ నిక్షిప్తాలను వెలికితీసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.

హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్
శక్తివంతమైన భారత్ ను రూపొందించడానికి బొగ్గు, మైనింగ్ శాఖలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పిన ఆయన,ఈ శాఖలలో తన బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే సాదాసీదాగా బండి సంజయ్ హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. సరిగ్గా 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు బండి సంజయ్ కుమార్.

హోంశాఖ సహాయ మంత్రిగా ప్రజా రక్షణ కోసం పని చేస్తా: బండి సంజయ్
తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతల కార్యక్రమానికి హాజరై వేద మంత్రోచ్చారణలతో బండి సంజయ్ కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు . భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. హోంశాఖ సహాయ మంత్రిగా తన బాధ్యతలను ప్రజల కోసం, ప్రజా రక్షణ కోసం నిర్వహిస్తామన్నారు బండి సంజయ్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+