సీఎం రేవంత్‌రెడ్డి ఇంట హైడ్రామా: కొండా దంపతుల అత్యవసర భేటీ

దీపావళి పండుగ శుభాకాంక్షల మాటున తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ , ఆమె భర్త కొండా మురళి దంపతులు ఈ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. సాధారణ శుభాకాంక్షల భేటీగా కనిపించినప్పటికీ, ఇటీవల కొండా కుటుంబం చుట్టూ జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనగా, కొండా దంపతులు ముఖ్యమంత్రికి కీలక విషయాలపై వివరణ ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. మంత్రి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అతడిని అరెస్ట్ చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి నివాసానికి చేరుకోవడంతో ఈ డ్రామా మొదలైంది.

Konda Couple Meets CM Revanth Reddy on Diwali Clarification on Reddy Conspiracy Allegations

పోలీసులను గేటు వద్దే అడ్డుకున్న కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత, మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు. కొండా సుస్మిత ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి కీలక నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

తమ కుటుంబంపై రాజకీయ కుట్ర జరుగుతోందని, బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని" సుస్మిత ధైర్యంగా విమర్శించారు. కుమార్తె చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా ముఖ్యమంత్రి , ఇతర కీలక మంత్రులను లక్ష్యంగా చేసుకోవడంతో, కొండా సురేఖ దంపతులు వ్యక్తిగతంగా సీఎంకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీపావళి శుభాకాంక్షల సందర్భంగా జరిగిన ఈ భేటీలో... తమ కుమార్తె చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం, మాజీ ఓఎస్‌డీ వ్యవహారం చుట్టూ జరిగిన పరిణామాలు , తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారనే ఆందోళనలను కొండా దంపతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖ పదవి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఈ రాజకీయ ఉద్రిక్తతకు తెరదించేందుకు ఈ భేటీ కీలకంగా మారనుంది. ఈ భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కొండా కుటుంబానికి ఎలాంటి హామీ లభిస్తుంది అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+