కేటీఆర్ కోసం కేసీఆర్ పావులు, హరీశ్‌కు అన్యాయం: సురేఖ ఫైర్, ‘వ్యాపారిగా కవిత, డీఎస్ తప్పేంటి?’
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మంగళవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబానికి తప్ప, ఎవరికీ న్యాయం జరగలేదని అన్నారు.

కేటీఆర్ కోసమే.. హరీశ్ నమ్మకస్తులకు సీట్లు?
మంగళవారం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తన వారసుడైన మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని విమర్శించారు. అందుకే హరీశ్‌రావు నమ్మకస్తులకు టిక్కెట్లు కేటాయించలేదన్నారు.

వ్యాపారిగా మారిన కవిత..
ఎన్నికల సమయంలో అమెరికా నుంచి వచ్చిన కవిత నెల రోజులు ఉండి వెళ్లిపోతానని చెప్పి వ్యాపారిగా మారిందని ఆరోపించారు. లష్కర్ బోనాల్లో కవిత ఏ ప్రొటోకాల్ ప్రకారం బంగారు బోనం ఎత్తుకుందని ప్రశ్నించారు. అదేనా బంగారు తెలంగాణ అంటే? అని కొండా ప్రశ్నించారు నయీం కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

హరీశ్‌కూ అన్యాయమే జరుగుతోంది..
‘మా కుటుంబానికి చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకే మీడియా ముందుకు వచ్చాను. పార్టీలో హరీశ్‌రావుకు కూడా అన్యాయం జరుగుతోంది. అందుకే ఇటీవల ఆయన రాజకీయాలను నుంచి తప్పుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నాకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ అధిష్ఠానం మాపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసిన తర్వాతే మా భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తాం'

డీఎస్ తప్పేంటి?
‘ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కాంగ్రెస్‌లో ఉంటే తప్పలేదు గానీ.. డీఎస్ కుమారుడు బీజేపీలో చేరితే విమర్శిస్తారా?. ఎర్రబెల్లికి ఓ న్యాయం.. డీఎస్‌కు ఓ న్యాయమా?. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన కేటీఆర్ అంకు సిద్దం కావాలి. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి చేతిలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం' అని కొండా సురేఖ జోస్యం చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications