మనీష్ సిసోడియాకు మద్దతుగా కేటీఆర్, హరీశ్ రావు: కేంద్రంపై విమర్శల దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం, దారికి రాకుంటే తమ భాగస్వాములైన ఈడీ, సీబీఐతో దాడులు చేయడం బీజేపీకి పరిపాటిగా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Modi’s Operandi is clear
— KTR (@KTRBRS) February 26, 2023
Target opposition parties by all means at his disposal; Either split the parties Or poach their MLAs & dislodge elected Governments
If nothing works, use their only allies; CBI, ED & IT to harass and launch a smear campaign
Back it with Paid Troll Army
ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంత మంది బీజీపీ నాయకుల మీద ఐటీ దాడులు, సీబీఐ దాడులు జరిగాయని కేటీఆర్ ప్రశ్నించారు. వీరంతా ఏమైనా సత్య హరిశ్చంద్రుడుకి బంధువులా? అని ప్రశ్నించారు. ప్రధాని సన్నిహితులను ఎలా కాపాడుతున్నారని దేశం దేశ ప్రజలు చూస్తున్నారని అన్నారు.

మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాసామికంటూ హరీశ్ రావు
సిసోడియాను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్నుశాఖలతో బెదిరిస్తోందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే సిసోడియా అరెస్ట్ చేశారన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కక్ష సాధింపు చర్యగానే మనీశ్ సిసోడియా అరెస్ట్ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
కాగా, లిక్కర్‌స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఆదివారం ఎనిమిది గంటలు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడం ద్వారా కేంద్రం మురికి రాజకీయాలు చేస్తుందని మండి పడ్డారు. మనీశ్ సిసోడియా అమాయకుడని వ్యాఖ్యానించారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications