Harish Rao: బావ హరీశ్ రావుకు అండగా నిలిచిన కేటీఆర్, కవిత..
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హనుమంతరావు సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని చెప్పారు. మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి విమర్శించారు. మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బీఆర్ఎస్ ముఖ్యనేతల ఖండించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హనుమంతరావు వ్యాఖ్యలను ఖండించారు. హరీశ్ రావు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఖండించారు.
One of our MLAs who was denied a ticket to his family member in an outburst has made some derogatory comments on Minister Harish Rao Garu
— KTR (@KTRBRS) August 21, 2023
I not only strongly condemn the MLA’s behaviour and also want to make it clear that we all stand with @BRSHarish Garu
He has been an…
"మా ఎమ్మెల్యేల్లో ఒకరు తన కుటుంబ సభ్యుడికి టికెట్ రాకపోవడంతో మంత్రి హరీష్ రావు పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను. నేను ఎమ్మెల్యే ప్రవర్తను ఖండించడంతో పాటు హరీశ్ రావుకు మద్దతుగా నిలుస్తాను. హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీ స్థాపించనప్పటి నుంచి ఉన్నారు. ఆయన పార్టీలో స్తంభం లాంటి వారు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపికన వారికి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. సిరిసిల్లలో తనకు మరోసారి అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవితంలో నిరాశ తప్పదని.. కొన్నిసార్లు మంచి నేతకు, ప్రజా సేవ చేసే క్రిశాంక్ వాటి వారితో పాటు మరికొందరికి టికెట్ రాకపొవచ్చని అన్నారు.వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాకపోవచ్చు కానీ వారు మరో రూపంలో ప్రజలు సేవ చేసే అవకాశం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు గారి నిబద్ధత మరియు BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు గారి పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023
హరీశ్ రావుపై మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. "తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు గారి నిబద్ధత, BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు గారి పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. అయితే హరీశ్ రావు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇవ్వడంపై కొందమంది అసంతృప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications