అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చెయ్యని కేటీఆర్.. కారణం ఇదే!!
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో నేటినుండి శాసన సభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తదితరులు ప్రమాణం చేశారు. అనంతరం మిగతా సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణం చేస్తున్నారు.
సభకు మొత్తం 109 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా తెలంగాణ సమావేశాలను బాయ్ కట్ చేసిన బీజేపీ శాసన సభా నియమాలను కాంగ్రెస్ కాలరాస్తుందని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో బిజెపికి సంబంధించిన ఎనిమిది మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నేడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయలేదు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి బి ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కు సర్జరీ జరగడంతో ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో మరో రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి తనకు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేయడం లేదని, ఇక వారందరితో కలిసి మరొక రోజు తాను ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేతగా కేసీఆర్ ను నిర్ణయిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏకవాక్య తీర్మానం చేసింది. అయితే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాల్సిన చోట కెసిఆర్ బాత్రూంలో జారిపడడం, ఆయన తుంటి ఎముక విరగడంతో నిన్న రాత్రి ఆయనకు సర్జరీ జరిగింది. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయన కూడా ఎమ్మెల్యేగా తర్వాతే శాసనసభలో ప్రమాణం చేయనున్నారు.
ఇదిలా ఉంటే శాసనసభ నియమాలను ఉల్లంఘించటాన్ని BJP వ్యతిరేకిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు G కిషన్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికయిన పార్టీ లెజిస్లేటర్లతో హైదరాబాద్ లో సమావేశం అయిన అనంతరం , విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెసు పార్టీ లోపాయికారి ఒప్పందంతోనే మజ్లిస్ కు ప్రొటెం స్పీకర్ అవకాశం ఇచ్చినట్లు ఆరోపించారు. మజ్లిస్ శాసనసభ్యులకంటే సీనియర్ సభ్యులు సభలో ఉన్నారనీ ఆయన పేర్కొన్నారు. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించడంపై తాము గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications