సోనియా బర్త్‌డేనే.. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవమా?

తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. మేడ్చల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారన్నారు.

తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందనే గుర్తిస్తారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతోందని విమర్శించారు. ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైందని.. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ మాయమైందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.

KTR lashes out at Congress government for changing the form of Telangana Thalli

సెక్రటేరియట్‌లో లంకె బిందెలు లేవని రేవంత్ రెడ్డి అర్థమైందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తే మీకు పరిపాలన రాదన్నారని.. అయితే, పదేళ్లో దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని చెప్పారు. ఇందిరాగాంధీ భారతమాత విగ్రహాన్ని హరిద్వార్‌లో ఏర్పాటు చేశారన్నారు. సమైక్య పాలకులు పగబడితే 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు.

హంతకులే సంతాపం తెలిపినట్లు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్లు తెలంగాణ తల్లి బీదగా ఉండాలని రూపాన్ని మార్చారంటూ కేటీఆర్ విమర్శించారు. ప్రపంచంలో ఆలిని మార్చిన వాళ్ళు ఉన్నారు కానీ.. తల్లిని మార్చిన మూర్ఖులు లేరంటూ కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు మార్చమన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి విగ్రహం మారాలా? అని రేవంత్ సర్కారును నిలదీశారు. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి ఫొటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుందామని బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

సోనియా జన్మదినమే.. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవమా?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జ‌న్మ దిన వేడుక‌ల‌ను తెలంగాణ త‌ల్లి అవ‌త‌ర‌ణ దినోత్స‌వంగా జ‌రుపుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్.. సోనియా బర్త్ డే‌ను అధికారికంగా జరపడం కోసమా ఈ తతంగమంతా? అని ఎక్స్ వేదిక‌గా నిలదీశారు.

'మీ కాంగ్రెస్ తల్లి బర్త్ డే కోసం.. మా తెలంగాణ తల్లిని బలిచేస్తావా..!! అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అంత అభిమానం ఉంటే మీ గాంధీ భవన్‌లో జరుపుకో.. లేదా ఢిల్లీ వెళ్లి 10 జ‌న్‌ప‌థ్‌లో చేసుకో.. అంతేకానీ..మీ పార్టీ జరుపుకోవాల్సిన బర్త్ డే ఫంక్షన్‌ను తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దుతావా ??' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.

'ఒకప్పుడు బలిదేవత అన్నావ్.. ఇప్పుడు బర్త్ డే జరుపుతా అంటున్నావ్.. నీ నరానికి నాలుక ఉండక పోవచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉందని కేటీఆర్ అన్నారు. పార్టీలు మార్చినంత ఈజీగా విగ్రహాల రూపురేఖలు మార్చవచ్చని అనుకోవడం నీ మూర్ఖత్వం. తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని కోట్లాది గుండెల నుంచి చెరిపేయొచ్చని అనుకోవడం నీ అమాయకత్వం' అని కేటీఆర్ ధ్వజమెత్తారు. జై తెలంగాణ.. జై తెలంగాణ తల్లి ట్వీట్ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+