సూపర్: ‘కంచె’ చిత్రంపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు 'కంచె' సినిమా సూపర్ ఉందని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారని కొనియాడారు.

KTR praises 'Kanche' movie team

తాను ఇప్పుడే సినిమా చూశానని, సినిమా చాలా క్వాలిటీగా ఉందని పొగిడారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ నటన చాలా బాగుందన్నారు. మూవీకి సినిమాటోగ్రఫ్రీ చక్కగా ఉందని, దర్శకుడు క్రిష్ చిత్రాన్ని ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించారని ట్విట్టర్‌లో మంత్రి అభ్రప్రాయపడ్డారు.

గతంలో కూడా మంత్రి కెటిఆర్ పలు చిత్రాలను చూసి.. ప్రశంసలు అందించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా, జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) డైరెక్షన్‌లో సినిమా తెరకెక్కిన 'కంచె' సినిమాకు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister KT Rama Rao on Sunday praised 'Kanche' movie team.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి