నాగార్జున ఫ్యాన్‌ని, ధనాధన్ క్రికెట్ అంటే ఇష్టం: కెటిఆర్

హైదరాబాద్‌: సినీ నటుడు నాగార్జునకు తాను ఫ్యాన్‌ను అని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. రాజకీయాల్లో తలమునకలవుతూ ఉండే కెటిఆర్ ఆదివారం సాయంత్రం క్రికెట్ గురించి, సినిమాలో గురించి మాట్లాడారు.

తెలుగు వారియర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు కేటీఆర్‌ హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియానికి వచ్చారు. తాను చిన్నప్పటి నుంచి నాగార్జునకు పెద్ద ఫ్యాన్‌ అని ఈ సందర్భంగా అన్నారు. వెంకటేశ్‌తో కలిసి చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లను చూశానని చెప్పారు. టీ20 మ్యాచ్‌లు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

ధనాధన్ షాట్లతో క్రికెటర్లు బంతిని బౌండరీలు దాటిస్తుంటే చూడడం తనకెంతో ఇష్టమని ఆయన అన్నారు. సినీ నటులు నాగార్జున, వెంకటేశ్, రానాలతో కలిసి మంత్రి కేటీఆర్ మ్యాచ్‌ను తిలకించారు.

KTR says he likes T20 and is a fan of Nagarjuna

సీసీఎల్-6లో తెలుగు వారియర్స్ అదరగొట్టింది. వారియర్స్ ఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. 208 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన వారియర్స్ ఓపెనర్ సచిన్ జోషి (49బంతుల్లో 114) అద్భుత సెంచరీకితోడు ప్రిన్స్ (43బంతుల్లో 61 నాటౌట్) హాఫ్‌సెంచరీతో విజృంభించడంతో వికెట్ మాత్రమే నష్టపోయి 211 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

సచిన్, ప్రిన్స్‌లు కలిసి తొలి వికెట్‌కు రికార్డుస్థాయిలో 171 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అంతకుముందు ధ్రువ్ శర్మ (97 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో బుల్డోజర్స్ 6 వికెట్లకు 207 పరుగులు సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+