చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు ...బాబు అరుపులు , కేకలు వర్కవుట్ కాలేదేమో

సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పిన , రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రత్యక్షంగా ఏపీ ఎన్నికల్లో పోటీ చెయ్యకున్నా , పరోక్షంగా జగన్ కు మద్దతు ఇచ్చారన్నది చంద్రబాబు మొదట నుండి చెప్తున్న విషయం .

చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వటానికి ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా తనదైన శైలిలో స్పందిస్తున్నారు కేటీఆర్ . తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చంద్రబాబుపై సమయానికి తగినట్టుగా సెటైర్లు వేస్తున్నారు .ట్విట్టర్ వేదికగా తన వాగ్బాణాలను సంధిస్తున్నారు. ఎన్నికలలో ఈవీఎంల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు పై కేటీఆర్ విమర్శలు చేశారు.

KTR setaires on Chandrababu .. all the theatrics, rhetoric and rabble rousing didn’t pay off for TDP

ఎన్నికల సందర్భంగా ఏపీలో జరిపిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అరుపులు, కేకలు, పెడబొబ్బలు పెద్దగా ఫలించినట్టు లేవని, అందుకే, తన ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారని కేటీఆర్ అన్నారు. బాబు చూపించిన రంగస్థల వాక్చాతుర్యాన్ని ప్రజలు పెద్దగా గుర్తించినట్టు లేదని ఆయన అన్నారు .అలాగే చంద్రబాబు కోసం పని చేసిన ఎల్లో మీడియా కూడా బాబు గెలుపుపై సందిగ్ధంలో ఉందని పేర్కొన్నారు .ఓటమి భయంతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావటం లేదని కేటీఆర్ ఛలోక్తులు విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+