అది అంతే, అక్కడలా చేశారు: బిజెపిపై కెటిఆర్ సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: బిజెపిపై తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కెటి రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఓ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలోని 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. శానససభ ఆవరణలోని తన ఛేంబర్‌లో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

బిజెపి విమర్శల కోసం విమర్శలు
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లను బిజెపి వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. విమర్శల కోసం విమర్శలు చేస్తోందని, విమర్శిస్తే ఓ పని అయిపోతుందన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

అక్కడేం చేశారో చెప్పాలి
మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉందని, అక్కడి ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు కల్పించకుండానే బిల్లు తెచ్చిందని ఆయన అన్నారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో స్థానిక రిజర్వేషన్లు కల్పించిన ేకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.

విడ్డూరం అది విడ్డూరం
తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో రిజర్వేషన్ల పోరాటం చేయడానికి ఇక్కడి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు ముడిపెట్టడం హాస్యాస్పదమని అన్నారు. తామేమీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం లేదని అన్నారు.

ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల కోసమే..
ప్రభుత్వంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆ పార్టీ నేతల అవగాహనారాహిత్యమని అన్నారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తే ఉన్నత విద్యా ప్రమాణాలతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కెటిఆర్ అన్నారు. బిజెపి గుడ్డిగా ప్రతిదాన్నీ విమర్శించడం మానుకోవాలని ఆయన సూచించారు.మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉందని, అక్కడి ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు కల్పించకుండానే బిల్లు తెచ్చిందని ఆయన అన్నారు
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications