హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కష్టాలు తీరినట్లే! ‘అన్నపూర్ణ’పై నాగార్జునను ఒప్పిస్తా: కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీ రామారావు నగర రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

KTR Will Talk To Nagarjuna On Annapurna Studio Land | Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీ రామారావు నగర రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియో లింకు రోడ్డుకు మోక్షం లభించనుంది.

దేశంలోనే పన్ను ఎగవేతదారుల్లో హైదరాబాద్ టాప్: ఎగవేత ఎంతంటే?దేశంలోనే పన్ను ఎగవేతదారుల్లో హైదరాబాద్ టాప్: ఎగవేత ఎంతంటే?

మాటిచ్చిన బాలకృష్ణ: టీలో 'పతంజలి', రాందేవ్-కవిత సమక్షంలో ఎంఓయూ, కేటీఆర్ ప్రశంసమాటిచ్చిన బాలకృష్ణ: టీలో 'పతంజలి', రాందేవ్-కవిత సమక్షంలో ఎంఓయూ, కేటీఆర్ ప్రశంస

రోడ్డు అభివృద్ధి కోసం ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య తగ్గించేందుకు రెండు సంవత్సరాల క్రితం ప్రతిపాదించిన లింకు రోడ్డు నిర్మాణానికి ప్లాన్‌ సిద్ధం చేసింది ప్రభుత్వం.

ట్రాఫిక్ కష్టాలకు అదే మార్గం

ట్రాఫిక్ కష్టాలకు అదే మార్గం

హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు రోజుకు రోజుకూ పెరిగిపోతున్నాయి. కీలక సమయా(ఉదయం, సాయంత్రం)ల్లో కిలో మీటరు దూరం వెళ్లాలంటే అరగంట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఉదయం, సాయంత్రం అయితే ట్రాఫిక్‌లో గమ్య స్థానాలకు వెళ్లడం సాహసమే అవుతోంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గాలంటే అంతర్గత దారులను విస్తరించాలని, లింకు రోడ్లు అభివృద్ధి చేయాలని గతంలో అనేక సర్వేలు తేల్చి చెప్పాయి. వీలు ఉన్న ప్రాంతాల్లో లింక్‌ రోడ్లు రూపొందించడం వల్ల చాలా వరకు ట్రాఫిక్‌ భారం తప్పుతుందని కొన్ని ప్రాంతాల్లో ఇది మంచి ఫలితాలు ఇచ్చిందని సర్వే నిర్వాహకులు చెప్పారు.

దృష్టిసారించిన కాంగ్రెస్, కానీ..

దృష్టిసారించిన కాంగ్రెస్, కానీ..

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించేందుకు కృష్ణానగర్‌, జవహర్‌నగర్‌, అన్నపూర్ణ స్టూడియోలను ఆనుకొని ఉన్న స్థలంలో నుంచి రోడ్డు వేస్తే నేరుగా బంజారాహిల్స్‌ వెళ్లే వెసులుబాటు ఉంటుందని ఓ సర్వే తేల్చి చెప్పింది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. లింకు రోడ్డుపై అధ్యయనం చేయాలని కోరింది. కానీ, ఆ తరువాత దాని గురించే మరిచిపోవడంతో ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

అన్నపూర్ణ స్డూడియోనే కీలకంగా..

అన్నపూర్ణ స్డూడియోనే కీలకంగా..

అయితే, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి గెలిచాక లింకు రోడ్డుపై దృష్టి సారించారు. అధ్యయనం పూర్తయ్యాక 8 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 2 నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్ద రోడ్డు ఏటవాలుగా దిగుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు ప్రమాదాలు జరిగేలా ఉన్నాయని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో నలభై ఫీట్లను 60 ఫీట్ల రోడ్డుగా మార్చారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని అన్నపూర్ణ స్టూడియోలో 20 ఫీట్ల స్థలం ఇచ్చేలా యాజమాన్యంతో ఒప్పందం కుదిర్చారు. అయితే ఇది కూడా సరిపోదని ఇంజనీరింగ్‌ విభాగం తేల్చి చెప్పింది. కనీసం 80 ఫీట్ల వెడల్పు మేర రోడ్డు విస్తరణ జరిగితేనే ప్రమాదాలు తలెత్తబోవని వివరించింది. అయితే, వీరి ప్రతిపాదన గత రెండేళ్లుగా ముందుకు సాగలేదు.

కేటీఆర్ స్వయంగా..

కేటీఆర్ స్వయంగా..

ఈ నేపథ్యంలోనే లింకు రోడ్డుపై నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే చింతల స్వయంగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. మంచినీటి పైప్‌ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి స్వయంగా అన్నపూర్ణ స్టూడియో లింకు రోడ్డును పరిశీలించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 2 నుంచి కింది వైపు రోడ్డుపై నడుచుకుంటూ.. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నాగార్జునను ఒప్పిస్తానంటూ కేటీఆర్ హామి

నాగార్జునను ఒప్పిస్తానంటూ కేటీఆర్ హామి

ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు చెబుతున్న అభ్యంతరాన్ని పరిశీలించిన కేటీఆర్.. రోడ్డును 80 అడుగులకు విస్తరించమే మేలనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో మరో ఇరవై ఫీట్లు అడగాలని నిర్ణయించారు. స్టూడియోలో 40 ఫీట్ల మేర వెనక్కి తగ్గితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. యాజమాన్యం ఒప్పుకుంటుందో లేదో అని ఎమ్మెల్యే చింతల సంశయం వ్యక్తం చేయగా.. తానే స్వయంగా సినీ నటుడు నాగార్జునతో మాట్లాడి ఒప్పిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నాగార్జున ఇందుకు ఒప్పుకుంటే.. లింకు రోడ్డు అందుబాటులోకి వచ్చి ఈ ప్రాంతం గుండా వెళ్లే వారి ట్రాఫిక్ సమస్య దాదాపు పూర్తిగా తీరిపోతుందని ఎమ్మెల్యే చింతల తెలిపారు.

హెచ్1బీ వీసాలు మరింత కఠినతరం: టెక్కీలకు ఈ బిల్లు శరాఘాతమే!హెచ్1బీ వీసాలు మరింత కఠినతరం: టెక్కీలకు ఈ బిల్లు శరాఘాతమే!

<strong></strong>అంబానీ ఫ్యామిలీనే ఆసియా టాప్: ఫోర్బ్స్ సంపన్న జాబితా ఇదేఅంబానీ ఫ్యామిలీనే ఆసియా టాప్: ఫోర్బ్స్ సంపన్న జాబితా ఇదే

English summary
Telangana minister KT Rama Rao will talk to Nagarjuna on Annapurna Studio land for Road expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X