తండ్రీకొడుకుల కొత్త నాటకాలు: కెసిఆర్‌పై రమణ, గ్రామజ్యోతితో ఒరిగేదేమి లేదన్న గుత్తా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకంపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పథకంతో ఒరిగేదేమి లేదని మండిపడ్డారు. గ్రామజ్యోతి పేరుతో కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ కొత్త నాటకానికి తెరదీశారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల జ్యోతి ఆరిపోతున్నా ముఖ్యమంత్రికి పట్టడం లేదన్నారు. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని టిడిపి ప్రభుత్వం ఇచ్చిందని రమణ గుర్తు చేశారు.
త్వరలోనే తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి కమిటీలను ఎన్నుకుంటామని రమణ తెలిపారు.
ప్రజలను మభ్యపెడుతున్న కెసిఆర్: ఎర్రబెల్లి

గతంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ.2 కోట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కెసిఆర్ కొత్త హమీలతో, పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చిన తర్వాతే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామజ్యోతితో ఒరిగేదేమీ లేదు: గుత్తా
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంపై నల్గొండ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పెదవి విరిచారు. ఈ పథకం వల్ల పైసా ఉపయోగం లేదని, జనాలకు ఒరిగేదేమీ లేదని అన్నారు.
కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారని, రానున్న రోజుల్లో ఈ పథకానికి ఒక్క పైసా కూడా విడుదల చేయరని జోస్యం చెప్పారు. గతంలో కూడా ఇలాగే అట్టహాసంగా నిర్వహించిన సమగ్ర సర్వే, మన ఊరు-మన ప్రణాళికలు మూలన పడ్డాయని ఎద్దేవా చేశారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications